ఇక మధ్యప్రదేశ్‌లో ఆహారం కల్తీ చేస్తే జీవితాంతం జైల్లోనే!

Food Adulteration In Madhya Pradesh Now Punishable With Life ImPrisonment - Sakshi

భోపాల్‌: రోజు తినే ఆహారాన్ని కల్తీ చేయడం కొంతమందికి వ్యాపారంగా మారింది. అయితే దాన్ని అరికట్టాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆహరాన్ని కల్తీ చేసే వారికి జీవితఖైదు శిక్ష విధించే చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ కొత్త చట్టాన్ని‌ రూపొందించింది. ‘మిలావత్‌ పే కసావత్‌’ నినాదంలో భాగంగా దీన్ని తీసుకొచ్చినట్లు మధ్యప్రదేశ్‌ హోంశాఖ మంత్రి‌ నరోత్తమ్‌ మిశ్రా శనివారం మీడియాకు తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్‌లో గతంలో ఆహర పదార్థాలు కల్తీ చేసేవారికి ఆరు నెలల జైలు శిక్ష విధించేవారు. ఆ తర్వాత దీన్ని మూడేళ్లకు పొడిగించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఆహారం కల్తీ చేసేవారికి మంత్రి వర్గం జీవితఖైదు విధించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇకపై తయారీ తేదీ ముగిసిన వస్తువులను అమ్మేవారికి విధించే శిక్షలను కూడా మరింత కఠినతరం చేస్తామని పేర్కొన్నారు. ఇక కేబినెట్‌ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆనందీబెన్ పటేల్‌‌ సూచించారు. ఆహరం కల్తీ క్షమించరాని నేరమని, ఇది ప్రజల ఆరోగ్యాన్నితీవ్రంగా ప్రభావితం చేస్తొందని ఆమె అన్నారు.
చదవండి: దత్తత పుత్రుడిని ఆశ్చర్యపర్చిన కేంద్రమంత్రి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top