
దేశ రాజధాని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోని పాత ఎమర్జెన్సీ విభాగంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 10 అగ్నిమాపక వాహనాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
వారు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 70 మంది రోగులు, ముగ్గురు నర్సులను బయటకు తీసుకొచ్చారు. అయితే ఇందుకోసం జేసీబీ సాయంతో భవనంలోని అద్దాలు పగలగొట్టవలసి వచ్చింది. ఈ విభాగంలో కుక్కకాటు బాధితులకు ఇంజక్షన్ ఇస్తుంటారు. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. షార్ట్‌సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.