రైతులపై టియర్‌ గ్యాస్‌.. ఢిల్లీ చలో వాయిదా | Farmers To Resume Delhi Chalo Updates | Sakshi
Sakshi News home page

రైతులపై టియర్‌ గ్యాస్‌.. ఢిల్లీ చలో వాయిదా

Dec 8 2024 9:46 AM | Updated on Dec 8 2024 5:45 PM

Farmers To Resume Delhi Chalo Updates

ఢిల్లీ : కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన  ఢిల్లీ చలో  కార్యక్రమం ఆదివారం వాయిదా పడింది.  

తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్, హర్యానాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో శంభు సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడి వందలాది మంది రైతులు పాదయాత్రగా ఢిల్లీ చలో కార్యక్రమాన్నిపున:ప్రారంభించారు. అయితే రైతులు నిర్వహిస్తున్న ఢిల్లీ చలో కార్యక్రమంపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు శంభు సరిహద్దులో భారీ ఎత్తున మోహరించారు. పాదయాత్రగా తరలివస్తున్న రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. 

పాదయాత్ర సాగకుండా ఇనుపు కంచెలు ఏర్పాటు చేయడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆదివారం చేస్తున్న ఢిల్లీ చలో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. తమ పాదయాత్రపై సోమవారం తమ భవిష్యత్‌ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. 
 

  • చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు సరిహద్దు నుంచి ముందుకెళుతున్న రైతులపై పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారు

  • రైతులను చెదరగొట్టేందుకు వారిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు

  • టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో రైతులు చెల్లాచెదురయ్యారు.

  • తమకు చెప్పిన 101 మంది ఇతరులు ర్యాలో పాల్గొన్నారంటున్న పోలీసులు 

  • అందుకే అడ్డుకున్నామని సమర్థింపు 

      

పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరు కొనసాగిస్తున్నారు.

డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ ఆదివారం(డిసెంబర్‌8) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది.

 

  • ‘ఢిల్లీ చలో’ నేపథ్యంలో దేశ రాజధాని  శంభు సరిహద్దు వద్ద ఉదయం నుంచే ఉద్రిక్తత నెలకొంది

  • రైతుల ర్యాలీని అడ్డుకునేందుకు సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్యారికేడ్లను సిద్ధంగా ఉంచారు.

  • సరిహద్దు వద్ద కవరేజీకి మీడియాకు అనుమతి నిరాకరించిన పోలీసులు

  • ఇది పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం, కేంద్రం కలిసి చేసి కుట్ర అని ఆరోపించిన రైతులు

  • గత ఆందోళనల్లో మీడియా ప్రతినిధులు గాయపడ్డారంటున్న పోలీసులు

 

  • నిజానికి శుక్రవారం నుంచే చలో ఢిల్లీ మలి విడత మొదలైంది.

  • రైతుల ర్యాలీపై హర్యానా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. 

  • ఈ ఘటనలో మొత్తం 16 మంది గాయపడ్డారు.. వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారు:రైతు నేతలు

  • పలువురు రైతులు గాయపడడంతో శనివారం ర్యాలీని నిలిపివేశాం.

  • తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు.

  • మాతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు.

  •  అందుకే చలో ఢిల్లీని ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం.

Advertisement
 
Advertisement
Advertisement