ఒకే బైక్‌పై ఏడుగురు ప్రయాణం.. నెట్టింట వీడియో వైరల్‌

A Family Of Seven Getting On A Single Bike Video Viral - Sakshi

ద్విచక్రవాహనంపై ఇద్దరు వెళ్లేందుకే అనుమతి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ముగ్గురు వెళ్తారు. బైక్‌ ముగ్గురు కూర్చుంటేనే కష్టంగా ఉంటుంది.. ఏకంగా ఏడుగురు ప్రయాణిస్తే..! ఆలోచిస్తే.. అసాధ్యం అనుంకుటున్నారు కదా? అయితే ఒకే బైక్‌పై ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు(నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి) వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తోంది. ఈ వీడియోను ఐఏఎస్‌ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. మాటల్లేవ్‌.. అంటూ ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు. 

వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన బైక్‌పై ముందు ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకోగా.. వెనకాల ఇద్దరు మహిళలు కూర్చున్నారు. వారి ఒడిలో ఇద్దరు పిల్లలను పట్టుకున్నారు. కుటుంబం మొత్తాన్ని ఒకే బైక్‌పై తీసుకెళ్లి ఔరా అనిపించాడు ఆ వ్యక్తి. అయితే, బైక్‌పై ఉన్న ఏ ఒక్కరికీ హెల్మెట్‌ లేకపోవటం గమనార్హం. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.2 మిలయన్ల మంది చూశారు. ఈ విధంగా ప్రయాణించి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు సరైన రవాణా సౌకర్యం లేకపోవటంతోనే ఇలా చేయాల్సి వచ్చిందేమోనని మద్దతు తెలుపుతున్నారు. ఏడుగురిని ఒకే బైక్‌పై తీసుకెళ్లిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: Ajith: బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top