ఇంటి పైకప్పుపై రూ. 40 లక్షల డబ్బు

UP Family Found 2 Bags Of Full Of Currency And Gold On House Roof - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. మీరుట్‌కు చెందిన ఓ కుటుంబానికి ఉదయం లేవగానే నమ్మలేని దృశ్యం ఎదురుపడింది. డబ్బు కట్టలు, బంగారంతో నిండి ఉన్న రెండు బ్యాగులను వారి ఇంటి పైకప్పుపై గుర్తించిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మీరుట్‌లో నివాసముంటున్న వరణ్‌ శర్మ అనే వ్యక్తి బుధవారం ఉదయం తన ఇంటి పైకప్పుపై రెండు బ్యాగులను గుర్తించాడు. తెరిచి చూడగా వాటి నిండ డబ్బు, నగలు కనిపించాయి. ఇది దొంగలించిన డబ్బుగా భావించి వెంటనే సర్దార్‌ పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. అక్కడి చేరుకున్న పోలీసులు దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసే డబ్బు, బంగారం సంచులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. వరుణ్‌ శర్మ ఇంటి పక్కనే ఉన్న వ్యాపారవేత్త పవన్‌ సింఘాల్‌కు సంబంధించి సొత్తుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసు అధికారి దీనేష్‌ బాగెల్‌ తెలిపారు. (చదవండి: ఆ ఇంట్లో.. అనుమానాస్పదస్థితిలో 6 మృతదేహాలు)

ఈ డబ్బు, నగలను పవన్‌ సింఘాల్‌ ఇంట్లో రెండేళ్లుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన రాజు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల నేపాల్‌కు వెళ్లిన రాజు కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి సెక్యూరిటి గార్డుతో కలిసి బుధవారం ఈ దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ క్రమంలో రెండు బ్యాగుల్లో డబ్బు, బంగారం సర్థేసి సీసీ టీవీలో కనిపించకుండా ఉండేందుకు వరుణ్‌ శర్మ ఇంటి పైకప్పుపై దాచినట్లు తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. దొంగతనం జరిగిన తన వస్తువులు, బంగారంపై స్పష్టత లేదని వాటిని లెక్కించిన అనంతరం ఫిర్యాదు చేస్తానని పోలీసులతో పవన్‌ సింఘాల్‌ పేర్కొన్నాడు. (చదవండి: చిన్నారుల హత్య: నర్సుపై ఛార్జ్‌షీట్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top