‘నీట్‌’ నిందితులకు నార్కో బ్రెయిన్‌ మ్యాపింగ్‌ టెస్టులు! | EOU may conduct brain mapping and narco-analysis tests of the accused | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ నిందితులకు నార్కో బ్రెయిన్‌ మ్యాపింగ్‌ టెస్టులు!

Jun 23 2024 6:34 AM | Updated on Jun 23 2024 6:34 AM

EOU may conduct brain mapping and narco-analysis tests of the accused

పాట్నా/దేవగఢ్‌:  నీట్‌–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బిహార్‌ పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నీట్‌ అసలైన ప్రశ్నపత్రాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎనీ్టఏ) నుంచి సేకరించారు. పేపర్‌ లీకేజీకి సంబంధించి గత నెలలో పాటా్నలోని ఓ ఇంట్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న ప్రశ్నపత్రాలతో ఈ ప్రశ్నపత్రాలను సరిపోల్చనున్నారు.

 ఫోరెన్సిక్‌ టెస్టు తర్వాత సరిపోల్చే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన నిందితులకు నార్కో అనాలిసిస్, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ టెస్టులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. నీట్‌ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాల్లో మనీ లాండరింగ్‌ కోణం కూడా ఉండడంతో  ఈడీ సైతం దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement