Elgar Parishad case: నవ్‌లఖా గృహ నిర్బంధం | Elgar Parishad case: Gautam Navlakha walks out of jail into house-arrest | Sakshi
Sakshi News home page

Elgar Parishad case: నవ్‌లఖా గృహ నిర్బంధం

Nov 20 2022 6:32 AM | Updated on Nov 20 2022 6:32 AM

Elgar Parishad case: Gautam Navlakha walks out of jail into house-arrest - Sakshi

ముంబై: ఎల్గార్‌ పరిషత్‌–మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన గౌతమ్‌ నవ్‌లఖాను అధికారులు శనివారం ముంబైలోని తలోజా జైలు నుంచి విడుదల చేశారు. వెంటనే నవీముంబైలోని బెలాపూర్‌– అగ్రోలీ ప్రాంతంలోని ఓ భవనంలోకి మార్చారు.

అక్కడే నెల రోజులపాటు ఆయన గృహ నిర్బంధంలో ఉంటారు. నవ్‌లఖాను గృహ నిర్బంధంలో ఉంచొద్దన్న ఎన్‌ఐఏ అర్జీని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల్లోగా గృహ నిర్బంధంలోకి తరలించాల్సిందేనంటూ ఆదేశించడం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement