ఓ ఎమ్మెల్యే.. ఆస్తి విలువ 70,000

As Per Election Commission Affidavit Bihar MLAs Assets Worth 70000 - Sakshi

రాజకీయాల్లోకి వచ్చిన అనతి­కాలంలోనే రూ. కోట్లకు పడగ­లెత్తి రాజ­ప్రా­సా­దా­ల్లాంటి ఇళ్లు కట్టుకున్న ఎందరో ప్రజాప్రతిని­ధులను ఇప్పటి­దా­కా మనం చూశాం.. కానీ మూడంతస్తుల అధికారిక నివాసాన్ని కేటా­యించినందుకే కృతజ్ఞతతో ఓ ఎమ్మెల్యే కన్నీటిపర్యంతం కావడం మీరెప్పుడైనా చూశారా?!! బిహార్‌లో  ఎమ్మెల్యే (అలౌలీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరఫున)గా గెలిచిన రామ్‌వృక్ష్‌  సదా తాజాగా తన అధికారిక ఇంటి తాళాలను అందుకుంటూ కంటతడి పెడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

బిహార్‌లోని అత్యంత పేద ఎమ్మెల్యే అయిన రామ్‌వృక్ష్‌  ఇప్పటివరకు తన ఐదుగురు కుమారులు, కుమార్తెతో కలసి  ఇందిరా ఆవాస్‌ యోజనలో భాగంగా కట్టిన ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కోసం రాజధాని పట్నాలో నిర్మించిన అధికారిక గృహ సముదాయంలో ఆయనకు సైతం ఇంటిని కేటాయించింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ చేతుల మీదుగా ఇంటి తాళాలు అందుకున్న ఆయన ఈ క్రమంలో భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు.

కంటతడి పెట్టారు. ‘పేదవాడు ఏదైనా పొందడం అంటే అది అతనికి దీపావళి పండుగ లాంటిదే.. నేను కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి ఇంట్లో ఉంటానని.. ఇది నాకు దీపావళే’ అని ఎమ్మెల్యే రామ్‌వృక్ష్‌  పేర్కొన్నారు. ఇటుకల బట్టీలో కూలీగా పనిచేసే ఈయన 1995లో ఆర్జేడీలో చేరారు. 2000లో ఆర్జేడీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2020లో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం ఆయన స్థిరాస్తుల విలువ రూ. 70 వేలు!!.  

(చదవండి: ఫోన్‌ ట్యాపింగ్‌పై భారీగా ఫిర్యాదులు?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top