
రాహుల్‌కు కర్ణాటక సీఈవో లేఖ
బెంగళూరు: గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ మహిళ రెండుసార్లు ఓటే సిందంటూ చేసిన ఆరోపణలకు ఆధారాలను అందజేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కర్ణాట క చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) లేఖ రాశారు. షకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటేసినట్లు పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డులు చెబుతు న్నాయని రాహుల్ కొన్ని పత్రాలను ప్రదర్శించారు.
ఓటరు ఐడీ కార్డును ఆమె రెండు సార్లు ఉపయోగించుకున్నారు. పోలింగ్ బూత్ టిక్ మార్కు వేశారు’అని అందులో ఉందని రాహుల్ ఆరోపించా రు. అయితే, తమ దర్యాప్తుపై షకున్ రాణి ఒక్క సారి ఓటేసినట్లు వెల్లడైందని సీఈవో తెలి పారు. టిక్ మార్కు పెట్టినట్లుగా రాహుల్ గాంధీ చూపిన ఓటరు జాబితా పోలింగ్ అధికారి అందజేసిందని కాదని సీఈవో స్పష్టం చేశారు.
‘షకున్ రాణి లేదా మరొకరు రెండు సార్లు ఓటేశారని ఆరోపిస్తూ మీరు చూపిన పత్రాలను మాకు అందజేయండి. పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతాం’అని రాహుల్‌కు రాసిన లేఖలో సీఈవో కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, కర్ణాటకలో మహదేవపు రం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఓటరు జాబితాలో దొంగ ఓట్లు నమోదయ్యా యని రాహు ల్ ఈసీ లక్ష్యంగా ఆరోపణలు చేయడం తెల్సిందే.