కొరడా ఝులిపించిన కేంద్ర ఎన్నికల సంఘం | EC Removed Home Secretary Of Six States And Bengal Police Chief Ahead Of Lok Sabha Elections - Sakshi
Sakshi News home page

కొరడా ఝులిపించిన కేంద్ర ఎన్నికల సంఘం

Published Mon, Mar 18 2024 2:39 PM

EC removed Home Secretary of six states Bengal police chief - Sakshi

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల  నేపథ్యంలో కేంద్ర ఎ‍న్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుపై ఈసీ కొరడా ఝులిపించింది. ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల మార్పు చేస్తూ  సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక ఈసీ తొలిసారి చర్యలు తీసుకుంది.

గుజరాత్, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోం కార్యదర్శులు మారుస్తున్నట్లు ఈసీ పేర్కొంది. మిజోరం జీఏడి కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ సీఎంఓ కార్యదర్శులు ఎన్నికల సంఘం తొలగించింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్‌ కుమార్‌ను ఎన్నికల సంఘం మార్చింది. ముంబై మున్సిపల్ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్ల ఈసీ తొలగించినట్లు తెలిపింది.

 
Advertisement
 
Advertisement