మోదీ, యోగీ అంశంపై వాగ్వాదం.. వ్యక్తిని చంపిన యువకుడు!

Driver Kills Man After Argument Over PM Modi CM Yogi In UP Mirzapur - Sakshi

ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. రాజకీయ అంశాలపై వాగ్వాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆధిత్యనాథ్ అంశాలపై జరిగిన వాగ్వాదంలో ఓ యువకుడు తమ వ్యక్తిని చంపేశాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు రాజేశ్వర్ దూబే(50). మీర్జాపూర్‌లో అతని సోదరుని ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. కారులో ఐదుగురు ప్రయాణికులతో పాటు దూబే ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో కారులో రాజకీయ అంశాలపై చర్చ మొదలైంది. ప్రధాని మోదీ, యోగీ ఆధిత్యనాథ్‌లపై చర్చ తారాస్థాయికి చేరింది. కారు మహోఖర్ గ్రామం వద్దకు చేరగానే ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రైవర్‌.. దూబేను కారు నుంచి దిగమని హెచ్చరించాడు. వారిరువురి వాగ్వాదంలో యువకుడు దూబేను చంపేశాడు. దూబే అక్కడికక్కడే మరణించినట్లు అతని బంధువులు తెలిపారు. 

విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు మీర్జాపూర్‌-ప్రయాగ్‌రాజ్ రోడ్డుపై ఆందోళనలు చేపట్టారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళనను శాంతింపజేశారు. నిందితుని కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.   

ఇదీ చదవండి:సన్‌ఫ్లవర్ ధరపై సమస్య..జాతీయ రహదారిని నిర్బంధించిన రైతులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top