అత్యంత ఖరీదైన, బంగారంతో చేసిన ఫుడ్‌ గురించి తెలుసా!? | Do You Know 5 Expensive Real Gold Made Dishes Across World | Sakshi
Sakshi News home page

Expensive Real Gold Dishes: అత్యంత ఖరీదైన డిషెస్‌ ఏవో తెలుసా?!

Aug 18 2021 9:27 PM | Updated on Aug 18 2021 9:36 PM

Do You Know 5 Expensive Real Gold Made Dishes Across World - Sakshi

గోల్డ్‌ ఐస్‌క్రీం (ఫొటో: స్కూపీ కేఫ్‌ ఇన్‌స్టాగ్రామ్‌)

ఏ రూపంలో ఉన్న బంగారం బంగారమే! పసిడి అంటే అందరికీ ఇష్టమే. నగలా మారి అతివల అందాన్ని ద్విగుణీకృతం చేయడంలోనూ... ఆపదల్లో ఆదుకునే కమోడిటిగానూ స్వర్ణానికి మంచి డిమాండ్‌ ఉంటుంది. మరి.. అదే బంగారం మనం తినే ఫుడ్‌లో కూడా ఉంటే! అచ్చంగా స్వచ్ఛమైన పసిడితో తయారు చేసిన ఆహార పదార్థాలను తింటే ఆ మజానే వేరు కదా!! ఇంతకీ.. ప్రపంచంలోని బంగారంతో చేసిన, అత్యంత ఖరీదైన టాప్‌-5 డిషెస్‌ గురించి మీకు తెలుసా?!

1. సూరత్‌ గోల్డ్‌ మిఠాయి
గుజరాత్‌లోని సూరత్‌ పట్టణం స్వీట్లకు పెట్టింది పేరు. ముఖ్యంగా అక్కడ బంగారంతో తీపి పదార్థాలు తయారు చేసే ‘‘24 క్యారెట్‌ మిఠాయి మ్యాజిక్‌’’ షాప్‌ బాగా ఫేమస్‌. అందులోనూ.. ఖర్జూరాలు, నెయ్యి, పిండితో చేసే గోల్డ్‌ మిఠాయి ‘ఘరీ’ అంటే అందరికీ మక్కువే. మరి బంగారంతో చేసిన స్వీట్‌ కదా. ధర కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. కిలో గోల్డ్‌ ఘరీ కొనుగోలు చేయాలంటే 9 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సాధారణ ఘరీ మాత్రం కేజీ 660- 820 రూపాయలకే దొరుకుతుంది. 

2. గోల్డ్‌ దమ్‌ బిర్యానీ
బిర్యానీ పేరు చెబితే చాలు నోట్లో నీరూరాల్సిందే. అలాంటిది బంగారంతో చేసిన బిర్యానీ అంటే లొట్టలేసుకుని తింటారు. అలాంటి వాళ్లు దుబాయ్‌లో ఎక్కువ మందే ఉన్నారట. మామూలుగానే అక్కడి వాళ్లకు బంగారం అంటే ప్రీతి. ఇక స్వచ్చమైన పసిడి మేళవింపుతో చేసిన రాయల్‌ గోల్డ్‌ బిర్యానీ అంటే మరీ ఇష్టమట. బంగారు పళ్లెంలో వడ్డించే ఈ బిర్యానీ సింగిల్‌ ప్లేట్‌ ధర రూ. 20 వేలు.


బాంబేబోరోహ్‌.. యూఏఈ ఇన్‌స్టా పేజీ

3. 24 క్యారెట్ల ఐస్‌క్రీం
హాంకాంగ్‌లో తయారు చేసే 24 క్యారెట్ల ఐస్‌క్రీంకు లగ్జరీ డిజర్ట్‌గా పేరుంది. సింగిల్‌ కోన్‌ ఐస్‌క్రీం లాగించాలంటే దాదాపు 950 రూపాయలు వెచ్చించాలి మరి!

4. 24 క్యారెట్‌ గోల్డ్‌ బర్గర్‌
కొలంబియాలోని టోరో మెకాయ్ రెస్టారెంట్‌లో అమ్మే 24 క్యారెట్‌ గోల్డ్‌ బర‍్గర్‌ ధర సుమారు. 4200 రూపాయలు.

5. గోల్డ్‌ పాన్‌
భారతీయులకు అత్యంత ఇష్టమైన మౌత్‌ ఫ్రెషనర్‌ పాన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భోజనం తర్వాత పాన్‌ వేసుకుంటే.. అదో తృప్తి. ఇక ఢిల్లీలోని కనాట్‌ ప్లేస్‌లో గల యామూస్‌ పాన్‌ షాపులో దొరికే గోల్డ్‌ పాన్‌కు ఫ్యాన్స్‌ ఎక్కువే ఉన్నారట. ఈ పాన్‌ కనీస ధర 600 రూపాయలట. 


యామూస్‌ పంచాయత్‌ ఇన్‌స్టా పేజీ అఫిషియల్‌

చదవండి: Afghanistan: 20 ఏళ్ల తర్వాత స్వదేశానికి.. ఎవరీ అబ్దుల్‌ ఘనీ?!
Afghanistan: అశ్రఫ్‌ ఘనీ ఎక్కడున్నారో తెలిసిపోయింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement