దిల్జిత్‌ దోసాంజ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ | Diljit Dosanjh Delhi concert gets police nod latest update | Sakshi
Sakshi News home page

దిల్జిత్‌ దోసాంజ్‌ సంగీత కచేరీకి అనుమతి

Oct 24 2026 2:21 PM | Updated on Oct 24 2026 3:07 PM

Diljit Dosanjh Delhi concert gets police nod latest update

దిల్జిత్‌ దోసాంజ్‌ (Photo: @diljitdosanjh)

న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్‌ దోసాంజ్‌ సంగీత కచేరీ యథావిధిగా కొనసాగనుంది. నిర్వాహకులతో సమావేశం అనంతరం ఢిల్లీ పోలీసులు శుక్రవారం తమ మునుపటి నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఈ కచేరీకి అనుమతి ఇచ్చారు. ‘బుక్‌ మైషో లైవ్‌’ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 30న నిర్వహిస్తోంది.

పండుగ సీజన్‌ నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు, శాంతిభద్రతల పరిస్థితి కారణంగా ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో దిల్జిత్‌ దోసాంజ్‌ కచేరీకి అనుమతి నిరాకరించినట్లు గురువారం పోలీసులు తెలిపారు. నిర్వాహకులు శుక్రవారం పోలీసులతో సమావేశమై చర్చించడంతో అనుమతి లభించింది. 

అక్టోబర్‌ 30న న్యూఢిల్లీలో దిల్జిత్‌ దోసాంజ్‌ ఆరా ఇండియా టూర్‌ (Aura India Tour) కచేరీ జరుగుతుందని ‘బుక్‌ మైషో లైవ్‌’ ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో దిల్జిత్‌ దోసాంజ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. త‌మ అభిమాన గాయకుడి పాట‌ల‌ను లైవ్‌లో వీక్షించేందుకు రెడీ అవుతున్నారు. 

ఇదీ చ‌ద‌వండి: ఢిల్లీ రికీ బహల్‌.. మహిళా పోలీసులే టార్గెట్‌

ఢిల్లీ తర్వాత నవంబర్ 15న ఇండోర్‌లో, నవంబర్ 21న అహ్మదాబాద్‌లో, నవంబర్ 27న ముంబైలో, నవంబర్ 29న బెంగళూరులో, డిసెంబర్ 5న లక్నోలో దిల్జిత్‌ దోసాంజ్‌ ఆరా ఇండియా టూర్‌ కచేరీలు కొన‌సాగనున్నాయి. చండీగఢ్‌లో కూడా లైవ్ క‌న్స‌ర్ట్ ప్ర‌క‌టించినా, తేదీ ఖ‌రారు కాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement