Mumbai: ‘పూజా మిస్సింగ్‌’ అని సెర్చ్‌ చేసి.. కన్నవాళ్ల చెంతకు చేరింది!

Digital Missing Poster Helped Teenaged Girl Reunite With Her Family - Sakshi

ఏడేళ్ల వయసులో కిడ్నాప్‌ అయ్యి... మళ్లీ టీనేజ్‌ వయసులో..

ఇటీవల కాలంలో ఎన్నో మిస్సింగ్‌ కేసులు గురించి వింటున్నాం. ఆయా కేసుల్లో కిడ్నాప్‌కి గురైన ఒకరో, ఇద్దరో తిరిగి తమ కుటుంబాన్ని కలుసుకోగలుగుతున్నారు. చాలావరకు మిస్సింగ్‌ కేసుల్లో పిల్లలను చంపడం లేదా అవయవాలు తీసి అడుక్కునే వాళ్లుగా మార్చడం వంటి దారుణాలు జరుగుతున్నాయి. మరి కొందరిని బాల కార్మికలుగా మార్చుతున్నవారు లేకపోలేదు. అచ్చం అలానే అమ్మాయి ఏడేళ్ల వయసులో తప్పిపోయింది. టీనేజ్‌ వయసులో తన కుటుంబాన్ని కలుసుకోగలిగింది. అదెలా సాధ్యమైందంటే...

వివరాల్లోకెళ్తే.... జనవరి 22, 2013న ముంబైలో పూజా అనే ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్‌కి గురైంది. పూజాకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. హెన్రీ జోసెఫ్‌ అనే వ్యక్తి తనకు పిల్లలు కలగకపోవడంతో పూజా అనే ఏడేళ్ల చిన్నారిని ఐస్‌క్రీం కొనిస్తానంటూ మాయమాటలు చెప్పి అపహరించాడు. ఎవరికి అనుమానం రాకూడదని ఆ చిన్నారిని కొద్ది రోజుల పాటు కర్ణాటకలోని ఒక హాస్టల్‌లో ఉంచాడు. పైగా ఆ చిన్నారి పూజా పేరుని అన్నీ డిసౌజాగా పేరు మార్చాడు. కొద్ది రోజుల తర్వాత జోసెఫ్‌ భార్యకి పిల్లలు కలగడంతో తాను కిడ్నాప్‌ చేసిన అమ్మాయిని హాస్టల్‌ నుంచి తీసుకువచ్చేశాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయిని పని అమ్మాయిగా ఇంట్లో చాకిరి చేయించడం మొదలుపెట్టాడు.

ఐతే జోసెఫ్‌ ఒకరోజు తాగిన మత్తులో అసలు విషయం బయటపెట్టాడు.. దీంతో ఆ అమ్మాయి తన వాళ్ల ఆచూకి కోసం ప్రయత్నిచడం ప్రారంభించింది. ఆమెకు కూడా తన కుటుంబం గురించి పెద్దగా గుర్తులేదు. అయినప్పటికీ తన గతం తాలుకా ఆధారాల కోసం గాలించడం మొదలు పెట్టింది. పూజా మిస్సింగ్‌ అని తన స్నేహితురాలితో కలిసి ఇంటర్నెట్‌లో సర్చ్‌ చేయడం మొదలుపెట్టింది. చివరికి 2013వ ఏడాదికి సంబంధించి ఒక డిజిటల్‌  మిస్సింగ్‌ పోస్టర్‌ని కనుగొన్నారు. అందులో ఐదు ఫోన్‌ నెంబర్లు ఉన్నాయి. కానీ వాటిలో నాలుగు నెంబర్లు పనిచేయడం లేదు. అదృష్టవశాత్తు ఒక్క నెంబర్‌ పనిచేస్తుంది.

అది పూజా కుటుంబం పొరుగున ఉండే రఫీ  అనే వ్యక్తిది. ఐతే ఆ అమ్మాయి జరిగిన విషయం అంతా అతనికి చెబుతుంది. దీంతో అతను పూజా వాళ్ల కుటుంబానికి ఈ విషయం చెప్పి పూజా వాళ్ల అమ్మ చేత కూడా మాట్లాడించడం తోపాటు పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి జోసెఫ్‌ని, అతని భార్యను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే సదరు నిందితుడు అప్పట్లో తన భార్యకు పిల్లలు కలగక పోవడంతోనే కిడ్నాప్‌ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు పోలీసుల సదరు అమ్మాయిని తన కుటుంబం చెంతకు చేరుస్తారు. 16 ఏళ్ల తర్వాత తప్పిపోయిన తన కూతురు తిరిగి తమ వద్దకు చేరడంతో పూజా తల్లి ఆనందానికి అవధులే లేకుండా పోయింది. ఐతే ఈ సుదీర్ఘ విరామంలో పూజా తన తండ్రిని కోల్పోవడం బాధాకరం.

(చదవండి: చంపడం ఎలా? అని సర్చ్‌ చేసి మరీ ....)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top