చంపడం ఎలా? అని సర్చ్‌ చేసి మరీ ....

Man After Watching Videos On Internet Kill Wife Claim Her Insurence  - Sakshi

టెక్నాలజీ మన అభివృద్ధికి ఉపయోగపడుతుందో లేదో గానీ వినాశనానికి మాత్రం ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పక తప్పదు. సాంకేతిక సాయంతో మనషులను చంపకునే దారుణ స్థితికి దిగజారిపోతున్నాం. అరచేతిలో ప్రపంచాన్ని అందిపుచ్చుకున్నామని ఆనందపడాలో లేక అది మానవ నాశనానికి స్వయంగా రూపొందించుకున్న మృత్యుపాశమనాలో తెలియడం లేదు. ఎందుకంటే ఇక్కడొక వ్యక్తి భార్యనే చంపేందుకు టెక్నాలజీని వాడాడు. అదికూడా చంపడం ఎలా అని ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసి మరీ మర్డర్‌కి ప్లాన్‌ చేశాడు.

వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.....మధ్యప్రదేశ్‌లోని రాజగఢ్‌ జిల్లాకి చెందిన బద్రీప్రసాద్‌ మీనా అప్పులుపాలై సతమతమవుతున్నాడు. ఐతే భార్య ఇన్సురెన్స్‌  డబ్బలుతో ఆ అ‍ప్పులు తీర్చాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. అందుకోసం తన భార్యనే చంపేందుకు పథకం వేశాడు. ఈ మేరకు బద్రీప్రసాద్‌ చంపడం ఎలా? అని ఇంటర్నెట్‌లో సర్చ్‌ చేసి...పలు రకాల వీడియోలు చూసి మరీ స్కెచ్‌ వేశాడు. ఈ మేరకు అతను తన ముగ్గురు సహచర వ్యక్తుల సాయంతో భార్య పూజాని జులై 26న భోపాల్‌కి సమీపంలోని రహదారిలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఐతే బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని చెప్పారు. తొలుత పోలీసుల విచారణలో అతను వారిని తప్పుదోవ పట్టించాడని అన్నారు. అంతేకాదు పోలీసులు తమదైన తరహాలో విచారించేటప్పటికి బద్రీప్రాసద్‌ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ మేరకు పోలీసులు బద్రీప్రసాద్‌తో పాటు, తన సహచరులలో ఒకరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని తెలిపారు. మిగతా ఇద్దరు సహచర వ్యక్తులు పరారీలో ఉన్నారని అన్నారు. 

(చదవండి: పదే పదే ఆడపిల్లలు పుడుతున్నారని తండ్రి కర్కశం.. కూతుర్ని నేలకేసి కొట్టిన ఆటో డ్రైవర్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top