ఢిల్లీ లిక్కర్‌ కేసు: అభిషేక్ బోయినపల్లి బెయిల్ కేసు డిసెంబర్ 4కు వాయిదా

Delhi Liquor Case Accused Boinapally Abhishek Bail Case Adjourned - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు బోయినపల్లి అభిషేక్  బెయిల్ కేసును సుప్రీం కోర్టు డిసెంబర్ 4కు వాయిదా వేసింది. అభిషేక్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కన్నా , జస్టిస్ ఎస్ ఎన్ వి భట్టి ధర్మాసనం.. ఈ కేసులో సెక్షన్ 19 పై లోతుగా విచారణ చేస్తామని తెలిపింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ  తనను అక్రమంగా అరెస్టు చేసిందని, బెయిల్  ఇవ్వాలని అభిషేక్  పిటిషన్ దాఖలు చేశాడు. లిక్కర్ కుంభకోణంలో ఇండో స్పిరిట్ నుంచి  3.85 కోట్ల రూపాయల ముడుపులు అభిషేక్ బోయినపల్లికి ముట్టినట్లు సాక్షాలు ఉన్నాయని ఈడి తరుపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో సెక్షన్ 19 పై లోతుగా విచారణ చేస్తామని తెలిపిన ధర్మాసనం..  ఈలోగా ఇరుపక్షాలు తమ ప్లీడింగ్స్  పూర్తి చేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: Delhi Schools: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top