ల‌క్ష‌ల‌తో కాదు, ఒక్క ఫోన్ కాల్ తో క‌రోనా పేషెంట్ల‌ను బ్ర‌తికిస్తున్నాడు

 Delhi Doctor Who Saved Corona Patients Through Tele Consultations - Sakshi

క‌రోనా వైద్యానికి ల‌క్ష‌లు అవ‌స‌రం లేదు

ఒక్క ఫోన్ కాల్ ద్వారా పేషెంట్ల ప్రాణాల్ని కాపాడుతున్న డాక్ట‌ర్ 

న్యూఢిల్లీ : క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో వైద్యం కావాలంటే ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టాల్సి వ‌స్తుంది. ధ‌న‌వంతులు హాస్పిట‌ల్ ఖ‌ర్చుకు వెన‌క‌డుగు వేయ‌డం లేదు గానీ సామాన్యులు మాత్రం హాస్ప‌ట‌ల్ బిల్లుకు భ‌యప‌డి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారి కోసం నేనున్నాను మీకేం కాదంటూ ఓ డాక్ట‌ర్ క‌రోనా బాధితుల‌కు అండ‌గా నిలుస్తున్నారు. ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయడం లేదు. స‌రైన సమయంలో ఒక్క ఫోన్ కాల్‌తో ప్రాణాల్ని కాపాడుతున్నాడు. అలా ఇప్ప‌టి వ‌ర‌కు ఫోన్ కాల్స్ ద్వారా సుమారు 1000 మంది క‌రోనా పేషెంట్ల ప్రాణాలు కాపాడి ప్రాణ దాత‌గా నిలిచాడు. 

ఢిల్లీలో డాక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న అమ‌రేంద్ర‌జా ఒక్క ఫోన్ కాల్‌తో క‌రోనా బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, బెడ్లు లేక ఆస్ప‌త్రికి వెళ్లాలంటే క‌రోనా బాధితులు భ‌య‌ప‌డే వారు. అలాంటి వారికి ఇంట్లో ఉండి క‌రోనాకు ట్రీట్మెంట్ ఎలా తీసుకోవ‌చ్చు? బ్రీతింగ్ స‌మ‌స్య‌ల్ని ఎలా అధిగ‌మించ‌వ‌చ్చు. క‌రోనా త‌గ్గించేందుకు ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలో చెబుతున్నారు. అలా చేయ‌డం వ‌ల్ల 1000మంది క‌రోనా పేషెంట్ల ప్రాణాల్ని నిల‌బెట్టిన‌ట్లు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. " క‌రోనా బాధితుల‌కోసం ఫోన్ కాల్ ద్వారా వైద్య సేవ‌ల్ని అందిస్తున్నాను. ప్ర‌తిరోజు 200 మందికి పైగా ఫోన్ కాల్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాను. క‌రోనా సోకితే ఆస్ప‌త్రికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. స‌రైన స‌మ‌యంలో వైద్యుల్ని సంప్ర‌దిస్తే స‌రిపోతుంది. నాకు తెలిసినంత వ‌ర‌కు ఒక్క నెల‌లో 1000 మంది క‌రోనా బాధితులు ఆస్ప‌త్రిలో చేరే అవ‌స‌రం లేకుండా వారి ప్రాణాల్ని కాపాడ‌గ‌లిగాను. ఈ క్లిష్ట‌ స‌మ‌యాల్లో ప్ర‌జ‌లకు అండ‌గా నిలిచేందుకు కృషి చేస్తున్న‌ట్లు డాక్ట‌ర్ అమ‌రేంద్ర‌ జా" తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top