సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స | CPM Leader Sitaram Yechury in critical condition put on ventilator at Delhi AIIMS | Sakshi
Sakshi News home page

సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

Sep 6 2024 10:00 AM | Updated on Sep 6 2024 1:34 PM

CPM Leader Sitaram Yechury in critical condition put on ventilator at Delhi AIIMS

న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నా, గురువారం ఆయన ఆరోగ్యం మరింత తీవ్రంగా క్షీణించింది. 

ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావడంతో వైద్యులు ఆయనకు ఐసీయూకి తరలించారు. తొలుత ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించారు. అనంతరం ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement