కవలల విషాదం: అమ్మా నువ్వేదో దాస్తున్నావ్‌ చెప్పు.. అంతలోనే

Covid 19: Meerut Twins 24 Year Old Deceased In Hours After Battle - Sakshi

కవలల జీవితాల్లో విషాదం నింపిన కరోనా

చెట్టంత కొడుకులు కళ్ల ముందే కన్నుమూశారు

కలిసి పుట్టిన అన్నదమ్ములు గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచారు

తల్లిదండ్రులకు తీరని కడుపుకోత

వెబ్‌డెస్క్‌: ఏప్రిల్‌ 23, 1997. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన గ్రెగరీ రైమండ్‌ రఫేల్‌ జీవితంలో మర్చిపోలేని రోజు. తన భార్య సోజా పండంటి మగ కవలలకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎప్పుడెప్పుడు భార్యాపిల్లలను చూస్తానా అంటూ ఆస్పత్రి గది బయట తిరగాడిన క్షణాలు ఆయనకు ఇంకా గుర్తే. పిల్లలకు జోఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ, రాల్‌ఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ అని పేర్లు పెట్టుకున్నారు రేమండ్‌ దంపతులు. 

ఇక జంట కవలలకు ఒకరంటే ఒకరికి ప్రాణం. ఏం చేసినా కలిసే చేసేవారు. ఇద్దరూ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లే. కోయంబత్తూరులోని కారుణ్య యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకున్నారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో భాగంగా జోఫ్రెడ్‌ అసెంచర్‌లో ఉద్యోగం సంపాదిస్తే.. రాల్‌ఫ్రెడ్‌ హుందాయ్‌ మ్యుబిస్‌ కంపెనీ(హైదరాబాద్‌ కార్యాలయం)లో ఉద్యోగానికి కుదిరాడు. ఆరు అడుగుల ఎత్తుతో, ఆకట్టుకునే రూపాలతో ఉండే కొడుకులు.. ముఖ్యంగా ప్రతీ పనిలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉండే కలివిడితనం చూసి రేమండ్‌  దంపతులు మురిసిపోని రోజు లేదు. 

పసిపాపలుగా ఉన్ననాటి నుంచే అన్నదమ్ములు ఒకరికిపై ఒకరు చూపే ఆప్యాయతకు తల్లిదండ్రులే ముగ్ధులయ్యేవారు. అంతటి అనుబంధం ఆ కవలలది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ అలాంటిది. అంతా సవ్యంగా, సంతోషంగా సాగిపోతోందనుకున్న వారి జీవితాల్లో కరోనా పెను విషాదాన్ని నింపుతుందని ఊహించలేకపోయారు. కలిసి పుట్టిన కవలలు కోవిడ్‌ బారిన పడి రోజు వ్యవధిలో మరణించడం తట్టుకోలేకపోతున్నారు. చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందే కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. 

నెగటివ్‌ వచ్చింది.. కానీ అంతలోనే
తమ జీవితంలోని తీరని విషాదం గురించి కవలల తండ్రి రేమండ్‌ మాట్లాడుతూ..‘‘ఇద్దరూ వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌ ఉండటంతో ఇంటికి వచ్చారు. ఏప్రిల్‌ 23న అన్నదమ్ములిద్దరికీ జ్వరం వచ్చింది. ఎందుకైనా మంచిదని వైద్యుల సలహాతో మెడికేషన్‌ ప్రారంభించారు. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి దిగజారిపోయింది. మే 1 వాళ్లను స్థానిక ఆస్పత్రిలో చేర్పించాం. కోవిడ్‌ అని తేలింది. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో వెంటే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స మొదలుపెట్టారు. కాస్త పరిస్థితి మెరుగుపడింది అనుకున్నాం. 

పది రోజుల తర్వాత ఇద్దరికీ నెగటివ్‌ వచ్చింది. కానీ.. కానీ మూడు రోజుల్లోనే అంతా తలకిందులైంది. జాఫ్రెడ్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఈ విషయాన్ని మేం రాల్‌ఫ్రెడ్‌కు చెప్పలేదు. తనను చూసేందుకు మేం వెళ్లగానే.. ‘‘అమ్మా.. నువ్వేదో దాస్తున్నాం. ఏదో జరిగింది. నాకు చెప్పడం లేదు కదా. చెప్పమ్మా ప్లీజ్‌’’ అని వాళ్ల అమ్మను అడిగాడు. 24 గంటలు గడవకముందే తను కూడా తనకెంతో ఇష్టమైన కవల సోదరుడి దగ్గరకు వెళ్లిపోయాడు. మూడు నిమిషాల వ్యవధిలో పుట్టిన మా కవలలు, రోజు వ్యవధిలో శాశ్వతంగా మమ్మల్ని విడిచివెళ్లిపోయారు. నిజానికి తన ప్రియమైన సోదరుడు జాఫ్రెడ్‌ లేకుండా రాల్‌ఫ్రెడ్‌ ఒంటరిగా ఇంటికి రాడని నేను ముందే ఊహించాను’’అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

మమ్మల్ని సంతోషపెట్టాలనుకున్నారు
టీచర్లమైన తాము ఎంతకష్టపడి పిల్లలను పెంచామో వాళ్లకు తెలుసునని, అందుకే తమకు లోకంలోని అన్ని సంతోషాలు ఇవ్వాలని కొడుకులు ఎంతో శ్రమించేవారని, విదేశాల్లో స్థిరపడాలని కలలు కన్నారని గుర్తుచేసుకున్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్లకు ఊహించని శిక్ష విధించాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా రేమండ్‌ దంపతులకు కవలల కంటే ముందు కుమారుడు నెల్‌ఫ్రెడ్‌ జన్మించాడు. ప్రస్తుతం అతడొక్కడే వారి బాధను కొంతనైనా తీర్చగలిగే ఆశాదీపం.

మేం కాపాడలేకపోయాం..
ఇద్దరూ ఎంతో ఫిట్‌గా ఆరు అడుగుల ఎత్తుతో బలంగా ఉన్నారు. కానీ కోవిడ్‌ వారిని బలితీసుకుంది. మేమెంతగా ప్రయత్నించినా ఆ కవలలను కాపాడలేకపోయాం అంటూ వారికి చికిత్స అందించిన వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: Plasma Therapy: ప్లాస్మా థెరపీ నిలిపివేత 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-05-2021
May 22, 2021, 17:57 IST
హైదరాబాద్‌: కరోనా నిబంధనలు పాటిస్తూ.. స్వీయ రక్షణకు సమష్టి నిర్ణయాలు తీసుకొని ఆచరిస్తూ కంటికి కనిపించని వైరస్‌ అనే శత్రువుతో...
22-05-2021
May 22, 2021, 17:11 IST
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా బాధితులకు ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్ష బ్లాక్‌మార్కెట్‌ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా రెమ్‌డెసివర్‌ను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న వ్యక్తిని...
22-05-2021
May 22, 2021, 16:42 IST
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రి వద్ద శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు మారుస్తుండగా...
22-05-2021
May 22, 2021, 15:41 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రపంచాన్ని వణికిస్తోంది. మరో వైపు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా..అంకితభావంతో...
22-05-2021
May 22, 2021, 15:40 IST
సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ పేరిట పోలీసులు విద్యుత్‌ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మే...
22-05-2021
May 22, 2021, 12:11 IST
సిడ్నీ: ‘‘థాంక్యూ ఇండియా.. నన్ను సొంత మనిషిలా ఆదరించారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు చూస్తుంటే గుండె పగిలిపోతోంది. దయార్ద హృదయం,...
22-05-2021
May 22, 2021, 11:19 IST
లక్నో: ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి పోలీసులు పగలు, రాత్రి శ్రమిస్తున్నారు. తమ విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ వీలు...
22-05-2021
May 22, 2021, 10:06 IST
రూ. కోటి మాత్రమే కాదు, ఆయన భార్యకు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం
22-05-2021
May 22, 2021, 09:23 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఒక్కో రాష్ట్రం లాక్‌డౌన్‌ ఆంక్షలను పొడగిస్తున్నాయి. అయితే కరోనా వైరస్‌కు...
22-05-2021
May 22, 2021, 09:08 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు టీకాలు అందించే విషయంలో ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరించడం వల్లనే వ్యాక్సిన్ల కొరత సమస్య ఎదురైందని  సీరమ్‌...
22-05-2021
May 22, 2021, 08:43 IST
సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: కోవిడ్‌ వచ్చి తగ్గినవారిలో పూర్తిగా  కోలుకుంటున్నవారు, కొద్దిరోజులపాటు  ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు.  కానీ  కొందరిలో కోవిడ్‌ తగ్గిన...
22-05-2021
May 22, 2021, 07:56 IST
సాక్షి, మంచిర్యాల: మండలంలోని తాళ్లపేటలో ఓ కుటుంబాన్ని కరోనా చిదిమేసింది. పదిహేను రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురిని బలితీసుకుంది....
22-05-2021
May 22, 2021, 07:36 IST
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టీమ్‌కు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా భారత ఒలింపిక్‌ సంఘం అరుణ్‌ను నియమించింది
22-05-2021
May 22, 2021, 06:12 IST
సాక్షి,అమరావతి: కోవిడ్‌ –19 చికిత్సలో వాడే మందులను నాట్కో ట్రస్టు తరఫున ఉచితంగా అందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నాట్కో...
22-05-2021
May 22, 2021, 05:55 IST
సాక్షి,, న్యూఢిల్లీ: దేశంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్లను అధికంగా వాడటం వల్ల ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం...
22-05-2021
May 22, 2021, 05:38 IST
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, చిప్కో ఉద్యమానికి ఊపిరిపోసిన సుందర్‌లాల్‌ బహుగుణ(94) కన్నుమూశారు.
22-05-2021
May 22, 2021, 05:15 IST
వాషింగ్టన్‌: వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఆలస్యం అయితే ఎక్కువ మేలు జరుగుతోందని తాజా పరిశోధన...
22-05-2021
May 22, 2021, 05:09 IST
వారణాసి/లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటతడి పెట్టుకున్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య యోధులతో సమావేశం సందర్భంగా.. వైరస్‌తో ప్రాణాలు...
22-05-2021
May 22, 2021, 04:08 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి చాలావేగంగా ఉన్న నేపథ్యంలో కోవిడ్‌తో ఊపిరితిత్తులతో పాటు గుండె సంబంధ సమస్యలు...
22-05-2021
May 22, 2021, 03:19 IST
సాక్షి ప్రతినిధి, నెల్లూరు, ముత్తుకూరు, నెల్లూరు (సెంట్రల్‌): ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు ఆయుర్వేద ఔషధం దివ్యంగా పనిచేస్తోందన్న...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top