Karnataka: తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి

Covid 19: Karnataka Reports 1806 New Cases 42 Succumbs - Sakshi

కర్ణాటక వార్తలు

1,806 మందికి కరోనా పాజిటివ్‌

8 మంది ఐఏఎస్‌ల బదిలీ

సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి  తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,806 మందికి పాజిటివ్‌గా నిర్ధారించగా 2,748 మంది కోలుకున్నారు. 42 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 28,80,370కు పెరిగింది. 28,12,869 మంది కోలుకున్నారు.  36,079 మంది మరణించారు. ప్రస్తుతం 31,339 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.18 శాతంగా ఉంది.

ఇక బెంగళూరు నగరంలో 411 కేసులు నమోదుకాగా 549 మంది డిశ్చార్జి అయ్యారు. 10 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12,21,371కు పెరగ్గా 11,93,213 మంది కోలుకున్నారు. 15,781 మంది మరణించారు. ప్రస్తుతం 12,376 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,52,908 నమూనాలు పరీక్షించారు. 1,88,908 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు.  దీంతో కరోనా టీకా పొందిన వారి సంఖ్య 2,68,06,999కు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. 

8 మంది ఐఏఎస్‌ల బదిలీ
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 8 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాహుల్‌ రత్నంపాండే–అసిస్టెంట్‌ కమిషనర్, కుమట ఉప విభాగ, ఉత్తరకన్నడ జిల్లా, వర్నిత్‌నేగి– అసిస్టెంట్‌ కమిషనర్‌ హణసూరు ఉపవిభాగ, మైసూరుజిల్లా, రాహుల్‌ శరణప్ప శంకనూరు– అసిస్టెంట్‌ కమిషనర్, లింగసూరు ఉప విభాగ, రాయచూరు, డాక్టర్‌ ఆకాశ్‌ ఎస్, అసిస్టెంట్‌ కమిషనర్, బళ్లారి ఉప విభాగ బళ్లారి, ఆనంద్‌ప్రకాష్‌ మీనా–అసిస్టెంట్‌ కమిషనర్, కోలారు ఉపవిభాగ, కోలారుజిల్లా, ప్రీతిక్‌ బయాల్‌–అసిస్టెంట్‌ కమిషనర్, సకలేశపుర, ఉప విభాగ, హాసన్‌ జిల్లా, మోనారోట్‌– అసిస్టెంట్‌ కమిషనర్, కలబురిగి ఉప విభాగ, కలబురిగి జిల్లా, అశ్విజ బీవీ– అసిస్టెంట్‌ కమిషనర్, సేడం ఉప విభాగ గుల్బర్గా.

వర్షాలపై కేంద్ర మంత్రి సమీక్ష 
యశవంతపుర: మలెనాడు, కోస్తా ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా కేంద్రమంత్రి శోభా కరంద్లాజె ఉడిపి, చిక్కమగళూరు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.   ప్రకృతి వికోపం, కరోనా నిర్వహణ, మూడోవేవ్, నివారణకు సిద్ధతలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆమె అధికారులతో చర్చించారు.     

అభివృద్ధిపై చర్చించటానికే ఢిల్లీకి.. 
సీఎం యడియూరప్ప నీటిపారుదల ప్రాజక్టులపై చర్చించటానికి ఢిల్లీ వెళ్లినట్లు మంత్రి ఆర్‌ అశోక్‌ తెలిపారు. శుక్రవారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు ఇందులో ఎలాంటి రాజకీయ భేటీలు లేవన్నారు.  

   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top