Covid Second Wave In India: కరోనా విలయం: రెండో స్థానంలోకి భారత్‌ | Covid Second Wave Cases And Deaths In India - Sakshi
Sakshi News home page

కరోనా విలయం: రెండో స్థానంలోకి భారత్‌

Apr 12 2021 10:32 AM | Updated on Apr 12 2021 6:34 PM

COVID-19: India records 1.7 lakh new cases, 904 deaths - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. రోజుకు లక్షకుపైగా గత కొన్ని రోజులుగా భయాందోళనలు పుట్టిస్తున్న మహమ్మారి దేశంలో సుమారు 1.7 లక్షల  కొత్త కేసులతో అడ్డూ అదుపూ లేకుండా వ్యాపిస్తోంది.  వరుసగా 33 రోజులుగా దేశవ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌లో  పంజా విసురుతోంది. భారతదేశం బ్రెజిల్‌ను అధిగమించి, కరోనావైరస్ నవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంది. రాయిటర్స్  ప్రకారం బ్రెజిల్ 1.34 కోట్ల కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసులు 1.35 కోట్లకు చేరుకుంది. 3.12 కోట్ల కేసులతో ప్రపంచ స్థాయికి అమెరికా ముందుంది.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రక​టించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 కేసులు నమోదవడం విస్తరణ తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే మరో 904 మంది కోవిడ్‌ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో  మొత్తం కేసుల సంఖ్య 1.35 కోట్లకు చేరగా, మరణించిన వారి సంఖ్య 1,70,179కి చేరింది.

ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కోవిడ్‌ ఉధృతి బాగా కనిపిస్తోంది.  మహారాష్ట్రలో కేసులు  37 శాతం పెరిగి 63,294 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గత 24 గంటల్లో 349 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో 15,276, ఢిల్లీలో 10,774 కేసులు నమోదయ్యాయి. (కరోనా సెకండ్ ‌వేవ్‌: కుప్పకూలిన మార్కెట్‌)

తెలంగాణలో  కరోనా ఉధృతి
తెలంగాణలో  కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  కొత్తగా 2,251  కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో  కేసుల సంఖ్య 3.29 లక్షలకు చేరింది. ఇప్పటివరకూ తెలంగాణలో మొత్తం 1765 మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 20,864 యాక్టివ్‌ కేసులుండగా,  ఇప్పటివరకు 3.05 లక్షల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. హైదరాబాద్‌ 355, మేడ్చల్ 258 , నిజామాబాద్ 244, రంగారెడ్డిలో 200 కేసులు నమోదుకావడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement