Covid Third Wave Updates: Coronavirus And Omicron Variant New Cases In India, Details Inside - Sakshi
Sakshi News home page

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

Jan 14 2022 9:32 AM | Updated on Jan 14 2022 10:30 AM

Coronavirus: 264202 Fresh COVID Cases Reported In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,64,202 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. అయితే గురువారంతో పోలిస్తే 6.7శాతం కోవిడ్‌ కేసులు అధికంగా పెరిగాయి. దేశంలో 14.78 శాతానికి పాజిటివిటీ రేటు చేరింది.

చదవండి: చుట్టేస్తోంది.. జాగ్రత్త: ప్రధాని మోదీ

దేశంలో ప్రస్తుతం 12,72,073యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 1,09,345 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 5,753 చేరింది. 

Advertisement
 
Advertisement
Advertisement