Corona: ఒక్కరోజులో తగ్గిన కరోనా కేసులు | Corona Update: India Covid Case Count Dips | Sakshi
Sakshi News home page

Corona: ఒక్కరోజులో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

May 3 2022 9:54 AM | Updated on May 3 2022 9:54 AM

Corona Update: India Covid Case Count Dips - Sakshi

స్వల్పంగా పెరుగుకుంటూ పోయిన కరోనా కేసులు.. ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ, ఉత్తరాదిలో మరికొన్ని చోట్ల కేసుల ఎఫెక్ట్‌తో గత వారం రోజులుగా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడు కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 568 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనాతో 20 మంది మృతి చెందినట్లు పేర్కొంది.

అంతకు ముందు రోజుతో పోలిస్తే.. ఇది 18.7 శాతం తక్కువ. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,84,913 కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు 5,23, 889 మంది మరణించారు(అధికారికంగా). రికవరీ రేటు 98.74 శాతానికి చేరుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 911 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల నుంచే 80.58 శాతం కొత్త కేసులు నమోదు అవుతుండగా.. ఢిల్లీ నుంచి ఎక్కువ కేసులు రికార్డు అవుతున్నాయి.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement