ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండి ఇలా..

Corona Test In Home: ICMR New Guidelines Released - Sakshi

కోవి సెల్ఫ్‌.. పరీక్షించుకోండిలా..

కిట్‌ వినియోగంపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు 

వీడియో రూపంలో అందుబాటులోకి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే తొలిసారిగా సొంతంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా పుణేకు చెందిన మైలాబ్‌ సంస్థ రూపొందించిన ‘కోవి సెల్ఫ్‌’ టెస్ట్‌ కిట్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) గురువారం ఆమోద ముద్ర వేసింది. రూ.250కి లభ్యమయ్యే ఈ కిట్‌ ద్వారా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు (ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌) వైద్య నిపుణుల సహాయం లేకుండానే సొంతంగా పరీక్షించుకోవచ్చు. సొంతంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు ఎలా చేసుకోవాలనే విషయంపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని వీడియో రూపంలో అందుబాటులోకి తెచి్చంది. ‘కోవి సెల్ఫ్‌’ టెస్ట్‌ కిట్‌ యూజర్‌ మ్యాన్యువల్‌లో కూడా కిట్‌ను ఎలా ఉపయోగించొచ్చనే సూచనలు ఉంటాయి.

కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారితో పాటు కోవిడ్‌ రోగులను కలిసిన వారు ఈ కిట్‌ను ఉపయోగించాలి. ముక్కులో నుంచి నమూనాలు తీసుకుని ఈ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పాజిటివ్‌గా తేలితే మళ్లీ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు.

పరీక్షలు ఇలా చేసుకోవాలి..

 • ఈ కిట్‌ను ఉపయోగించే వారు మొదట ‘కోవి సెల్ఫ్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి.
   
 • పరీక్ష చేసుకోవడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కుని తడిలేకుండా చూసుకోవాలి.
   
 • కోవిసెల్ఫ్‌ కిట్‌లో 3 విడి భాగాలు ఉంటాయి. నాసల్‌ స్వాబ్‌ (ముక్కులో నుంచి శాంపిల్‌ తీసుకునేందుకు), శాంపిల్‌ తీసిన తర్వాత స్వాబ్‌ను పెట్టేందుకు ఉపయోగించే ఒక చిన్న ట్యూబ్, టెస్ట్‌ కార్డు (పరీక్ష ఫలితాన్ని తెలిపేది) ఉంటాయి.
   
 • నాసల్‌ స్వాబ్‌ను ముక్కు రంధ్రాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపల వరకు పెట్టుకుని కనీసం 5 సార్లు తిప్పాలి. ప్రత్యేక ద్రవంతో కూడిన ట్యూబ్‌ను తెరిచి ఈ స్వాబ్‌ తలభాగాన్ని అందులో మునిగేలా పెట్టి 10 సార్లు తిప్పాలి.
   
 • స్వాబ్‌ను విరగ్గొట్టిన తర్వాత ట్యూబ్‌కు మూత పెట్టి, దాన్ని నెమ్మదిగా ఒత్తుతూ ట్యూబ్‌ మూతలోని రంధ్రం ద్వారా రెండు చుక్కలను టెస్ట్‌ కార్డు చివరలో ఉండే చిన్న గుంతలాంటి భాగంలో వేయాలి. కిట్‌ను ఉపయోగించేవారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత టెస్ట్‌ కార్డు ఫోటో తీసుకోవాలి.
   
 • 15 నిమిషాల తర్వాత మొబైల్‌ యాప్‌లో ఫలితం కనిపిస్తుంది. 20 నిమిషాల తర్వాత కనిపించే ఫలితాన్ని ఇన్‌వ్యాలిడ్‌గా భావించాలి. ఈ ఫలితాన్ని ఐసీఎంఆర్‌ కోవిడ్‌ టెస్టింగ్‌ పోర్టల్‌లో భద్రపరుస్తారు.
   
 • పాజిటివ్‌గా తేలితే కోవిడ్‌ నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి.

చదవండి: కరోనా.. తెల్లారితే కూతురు పెళ్లి.. అంతలోనే తండ్రి
చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

21-05-2021
May 21, 2021, 19:58 IST
పిట్టకథలు.. పెట్టీ కేసులు.. 
21-05-2021
May 21, 2021, 17:55 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 92,231 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,39,184...
21-05-2021
May 21, 2021, 16:50 IST
‘ఓం కరోనా ఫట్‌, ఫట్‌, ఫట్‌.. స్వాహా..’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మంత్రాలు జపించాడు....
21-05-2021
May 21, 2021, 16:28 IST
సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాలు మినహా దాదాపు...
21-05-2021
May 21, 2021, 15:26 IST
సిడ్నీ:  కోవిడ్‌-19పై భారత్‌ అలుపెరుగని పోరాటం చేస్తోందని, త్వరలోనే మహమ్మారిని తరిమికొట్టి పూర్వపు వైభవాన్ని సంతరించుకుంటుందని  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌...
21-05-2021
May 21, 2021, 14:36 IST
కోల్‌కతా: కోవిడ్‌ ఎందరినో బలి తీసుకుంది. ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. రూపు మార్చుకుంటూ.. ఆనవాలు చిక్కకుండా జనాలను అంతం చేస్తుంది....
21-05-2021
May 21, 2021, 12:26 IST
హైదరాబాద్‌: మహమ్మారి కరోనా మనుషుల ప్రాణాలు బలిగొనడంతో పాటు మానవత్వాన్ని కూడా మంటగలుపుతోంది. సాటి మనిషి చనిపోతే అయ్యో పాపం...
21-05-2021
May 21, 2021, 10:09 IST
కరోనాను నివారించే ఆయుర్వేద మందు పంపిణీకి రంగం సిద్ధమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో మూడు...
21-05-2021
May 21, 2021, 09:44 IST
నాగబాబు కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. కొద్ది రోజుల క్రితమే నేను...
21-05-2021
May 21, 2021, 09:09 IST
కంటికి కనిపించని కరోనా ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడుతోంది. శారీరకంగా, మానసికంగా హింసిస్తూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. ఇక...
21-05-2021
May 21, 2021, 06:23 IST
సీఎంల పట్ల మోదీ వ్యవహరించిన తీరుపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.
21-05-2021
May 21, 2021, 06:11 IST
న్యూఢిల్లీ: రోజూవారీ కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం రోజుకు 16–20 లక్షల కరోనా...
21-05-2021
May 21, 2021, 06:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజూ కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్యతో పోల్చితే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటోంది....
21-05-2021
May 21, 2021, 05:27 IST
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదోలా కరోనా సోకింది. ఐసోలేషన్‌లో ఉంటూ, జాగ్రత్తగా మందులు వాడుతూ.. కరోనా నుంచి బయటపడ్డారు.. మరి...
21-05-2021
May 21, 2021, 05:27 IST
పిల్లలు, యువతలో కరోనా వైరస్‌ వ్యాప్తిని, వారిపై దాని ప్రభావాన్ని, తీవ్రతను నిశితంగా పరిశీలించి, రికార్డు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర...
21-05-2021
May 21, 2021, 05:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఆరోగ్య వ్యవస్థకు మరో వ్యాధి సవాల్‌ విసురుతోంది. కరోనా...
21-05-2021
May 21, 2021, 05:03 IST
బ్లాక్‌ ఫంగస్‌ తరహాలోనే మనపై దాడిచేసే మరో మహమ్మారి.. వైట్‌ ఫంగస్‌. దీని అసలు పేరు కాండిడా అల్బికాన్స్‌. ఇది...
21-05-2021
May 21, 2021, 03:02 IST
న్యూఢిల్లీ: కరోనా నిర్థారణ పరీక్షలు ఇకపై క్షణాల్లోనే నిర్వహించే పద్దతిని అమెరికాలోని ఫ్లోరియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. బయో...
21-05-2021
May 21, 2021, 02:49 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను పరామర్శించి వారిలో ధైర్యం నింపడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం...
21-05-2021
May 21, 2021, 02:39 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top