ముంబైలో బాలీవుడ్‌ సెలబ్రెటీలతో యోగి భేటీ

UP CM Yogi Adityanath Met Bollywood Celebs In Mumbai - Sakshi

ముంబైలో బాలీవుడ్‌ ప్రముఖ సెలబ్రెటీలతో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం సమావేశమయ్యారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఉత్తరప్రదేశ్‌ని చలన చిత్ర అనుకూల రాష్ట్రంగా తెలియజేస్తూ..సినీ నిర్మాణానికి గమ్యస్థానంగా మార్చడం కోసం యోగి ఆదిత్యనాథ్‌ బాలీవుడ్‌  సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖు సభ్యులను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం యోగి మాట్లాడుతూ...సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు సభ్యులను ఎంపీలుగా చేశాం అని చెప్పారు. అలాగే మీరు ఎదుర్కొంట్ను సమస్యలకు ఏం చేయాలో కూడా తమకు తెలుసు అని అన్నారు.

అదీగాక సమాజాన్ని ఏకం చేయడానికి, దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో సినిమా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌ చలనచిత్ర అనుకూలా రాష్ట్రంగా ఆవిర్భవించిందని, జాతీయ చలచిత్ర అవార్డుల్లో, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఐఎఫ్‌ఎప్‌ఐ)లో గుర్తింపు లభించిందని చెప్పారు.

అంతేగాదు తమ ప్రభుత్వ సినిమా పాలసీ ప్రకారం..యూపీలో వెబ్‌సిరీస్‌ చిత్రీకరిస్తే 50% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అలాగే స్టూడియోలు, ఫిల్మ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు 25 శాతం సబ్సిడీ ఇస్తమాని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బోనీకపూర్, గోరఖ్‌పూర్ లోక్‌సభ ఎంపీ, నటుడు రవికిషన్, భోజ్‌పురి నటుడు దినేష్ లాల్ నిర్హువా, నేపథ్య గాయకులు సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, నటుడు సునీల్ శెట్టి, సినీ నిర్మాతలు చంద్రప్రకాష్ ద్వివేది, మధుర్ భండార్కర్, రాజ్‌కుమార్ సంతోషి తదితరులు పాల్గొన్నారు. 

(చదవండి: శబరిమలైలో విడిచిపెట్టినా..తిరిగొచ్చిన పావురం..బిత్తరపోయిన యజమాని)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top