శబరిమలైలో విడిచిపెట్టినా..తిరిగొచ్చిన పావురం..బిత్తరపోయిన యజమాని

Pigeon Left In Sabarimala Reached Its Owner - Sakshi

సాక్షి, దొడ్డబళ్లాపురం: సమాచారాన్ని చేరవేసుకోవడానికి ఇప్పుడయితే మొబైళ్లు, ఈ మెయిళ్లు ఉన్నాయి. కొన్నేళ్లక్రితం ఉత్తరాలు, టెలిగ్రాంలు ఉండేవి. అయితే అంతకంటే ముందు మహారాజుల కాలంలో ఇవేవీ ఉండేవి కావు. అందుకే పావురాళ్లను ఉత్తరాలు చేరవేసే పోస్టుమ్యాన్లుగా ఉపయోగించేవారు. కాలం మారినా పావురాళ్ల తెలివిలో తేడా రాలేదు.

ఇందుకు చక్కటి ఉదాహరణగా చిత్రదుర్గ జిల్లా మొళకాళ్మూరు తాలూకా మేగలహట్టి గ్రామంలో జరిగిన ఒక సంఘటన చెప్పుకోవచ్చు. మేళగట్టి గ్రామానికి చెందిన వెంకటేశ్‌ ఇటీవలే అయ్యప్ప మాల ధరించి అయ్యప్ప దర్శనం చేసుకుని వచ్చాడు. దర్శనం తరువాత తనతోపాటు తీసుకువచ్చిన పావురాన్ని గత డిసెంబరు 30న శబరిమలెలో వదిలేశాడు. ఆశ్చర్యంగా పావురం గురువారం గ్రామాన్ని చేరుకుని యజమాని వెంకటేశ్‌ ఒడిలో వాలిపోయింది. పెంచిన రుణాన్ని మర్చిపోలేని పావురం ఇలా గ్రామానికి తిరిగి రావడం పట్ల గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

(చదవండి: తాగుబోతు భర్తకు గుణపాఠం..చైన్లతో కట్టేసి..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top