రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన క్లీన్‌ ద కాస్మోస్‌ క్యాంపెయిన్‌ టీమ్

Clean the Cosmos:  Sadhguru Rameshji Guruma Met President Murmu - Sakshi

ఉగాది వేళ క్లీన్‌ ద కాస్మోస్‌ Clean the Cosmos క్యాంపెయిన్‌ టీమ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కలుసుకున్నారు. క్లీన్‌ ద కాస్మోస్‌ ప్రచారం ద్వారా విశ్వంలో సానుకూల పరిస్థితులను తీసుకువచ్చేందుకు తమ టీమ్ చేస్తున్న యత్నాలను సద్గురు రమేష్‌ జీ, గురుమా..  రాష్ట్రపతి ముర్ముకి వివరించారు.

క్లీన్‌ ద కాస్మోస్‌ అనేది ఆధ్మాత్మిక, దైవ ప్రచారం. మానవ జాతి సంక్షేమం కోసం సద్గురు రమేష్‌ జీ దీనిని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా మానవ మెదళ్లు అతి తీవ్రమైన నెగిటివిటీతో సతమతమవుతున్నాయి. ఆలోచనలు మాత్రమే కాదు భావోద్వేగాలూ అదే రీతిలో ఋణాత్మకతను విశ్వంలోకి జారవిడుస్తున్నాయి. తిరిగి ఈ విశ్వం నుంచి మానవజాతి దానిని స్వీకరిస్తుండంతో నేరాలు, నెగిటివ్‌చర్యలైన టెర్రరిజం, ప్రతీకారం, కోపం, యుద్ధాలు, హత్యలు, డిప్రెషన్‌ లాంటివి కనిపిస్తున్నాయి. దీంతో ప్రతికూలత, ప్రతికూల ప్రకంపనలు, ప్రతికూల చర్యల యొక్క దుర్మార్గపు చక్రంలో చిక్కుకున్నాము. మనం వీలైనంత త్వరగా ఈ నెగిటివిటీ నుంచి బయట పడాల్సి ఉంది. దీనికి ఉన్న ఒకే ఒక్క పరిష్కారం పాజిటివ్‌ వైబ్రేషన్స్‌తో ఈ విశ్వాన్ని నింపడం. సానుకూల అంశాలు, ప్రార్థనలతో మనం అత్యంత ఆప్రమప్తంగా పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ను విశ్వంలోకి విడుదల చేయాలని క్లీన్‌ ద కాస్మోస్‌ క్యాంపెయిన్‌ టీమ్ రాష్ట్రపతికి వివరించింది.

సరాసరిన, మానవ మెదడులో 60–80 వేల ఆలోచనలు వస్తుంటాయి. వీటిలో 90% నెగిటివ్‌ ఆలోచనలు ఉండటంతో పాటుగా పునరావృతమూ అవుతుంటాయి. అంతర్జాతీయంగా సమస్యలైనటువంటి డిప్రెషన్‌, ఆత్మహత్యలు, టెర్రరిజం, క్రూరమైన నేరాలు, మతపరమైన అల్లర్లు, హింస, యుద్ధాలు, ద్వేషం, అహం వంటివి ఈ తీవ్రమైన ప్రతికూల ప్రకంపనల ఫలితం. ప్రపంచవ్యాప్తంగా ఈ క్లీన్‌ ద కాస్మోస్‌ క్యాంపెయిన్‌ కార్యక్రమాన్ని తీసుకువెళ్లేందుకు సహాయం చేయాలని టీమ్ రాష్ట్రపతిని అభ్యర్ధించింది.

సద్గురు రమేష్‌జీ , రమేష్‌ జైన్‌గా ఓ వ్యాపార కుటుంబంలో జన్మించారు. అనంతర కాలంలో ఆధ్యాత్మికవేత్తగా మారారు. హఠ యోగ, కుండలిని యోగ క్రియ యోగాలో అత్యున్నత నైపుణ్యం కలిగిన ఆయన శ్రీ స్వామి పూర్ణానంద జ్ఞాన బోధలతో ఆయనకు శిష్యునిగా మారి, ఆశీస్సులు పొందారు.

ప్రజలు సంతోషంగా జీవించడంలో సహాయపడటానికి తన జీవితం అంకితం చేసిన గురూజీ, వారిని ఆధ్యాత్మిక దిశగా తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన బోధనలను చేస్తున్న ఆయన యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ఛానెల్స్‌లో వేలాది వీడియోలు, ఆధ్యాత్మిక బోధనలతో ప్రజలకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. సద్గురు రమేష్‌జీ రెండు అత్యంత ప్రశంసనీయమైన పుస్తకాలు సోల్‌ సెల్ఫీ, సోల్‌ మంత్రను రచించారు. ఆయన ఇటీవలే క్లీన్‌ ద కాస్మోస్‌ ప్రచారం ప్రారంభించారు. హైదరాబాద్‌కు సమీపంలో జన్వాడ వద్ద పూర్ణ ఆనంద ఆశ్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top