ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

Published Thu, Dec 21 2023 5:09 AM

Chhattisgarh Maoist encounter - Sakshi

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. వెంటనే తేరుకున్న మావోయిస్టులు ఎదురుకాల్పులు జరుపుతూ సమీప అటవీప్రాంతంలోకి పారిపోయినట్టు సమాచారం.

పోలీసులు మావోల క్యాంప్‌ను ధ్వంసం చేశారు. ఘటనాస్థలిలో భారీగా పేలుడు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ‘‘మావోల జాడ కోసం గాలింపు చేపట్టగా సమీప ప్రాంతాల్లో రక్తపు మరకలు ఎక్కువగా కనిపించాయి. ఎన్‌కౌంటర్‌ సందర్భంగా దాదాపు ఆరుగురు మావోలు తీవ్రంగా గాయపడి ఉండొచ్చు లేదా మరణించి ఉండొచ్చు ఉండొచ్చు’’ అని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement