చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా అధికారులతో 'సిట్'

Chandigarh University Row All Women Special Investigation Team - Sakshi

చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. ఈమేరకు సీఎం భగవంత్ మాన్ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి గురుప్రీత్ దేవ్ పర్యవేక్షణలో సిట్ ఈ కేసును వేగంగా విచారించనుంది.

ముగ్గురు అరెస్టు..
యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ముగ్గురుని అరెస్టు చేశారు పోలీసులు. స్నానం చేస్తుండగా తానే స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోను పంపిన అమ్మాయి, దీన్ని రిసీవ్‌ చేసుకున్న సిమ్లాకు చెందిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌ సన్నీ మెహతాతో పాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన హిమాచల్‍ప్రదేశ్ పోలీసులకు పంజాబ్‌ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

వార్డెన్ల సస్పెన్షన్‌
వీడియో లీక్ చేసిన అమ్మాయిని హాస్టల్ వార్డెన్ తిట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. వీడియో లీక్ విషయాన్ని పోలీసులకు ముందుగా చెప్పనందుకు ఆమెను, మరో వార్డెన్‌ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు.

6 రోజులు క్లాసులు బంద్‌..
విద్యార్థినుల నిరసనలతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం(సెప్టెంబర్ 24) వరకు క్లాసులు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే విద్యార్థుల డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించిందని, దీంతో వాళ్లు నిరసన విరమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూనివర్సిటీలో తమకు భద్రత లేదని కొంతమంది విద్యార్థినులు బ్యాగులు సర్ధుకుని ఇంటిబాట పట్టారు.
చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్‌..?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top