జెన్‌ జెడ్‌కు భయపడి ఎమర్జెన్సీ  విధించారు | Centre govt is afraid of Gen Z, has imposed Emergency | Sakshi
Sakshi News home page

జెన్‌ జెడ్‌కు భయపడి ఎమర్జెన్సీ  విధించారు

Oct 10 2026 5:49 AM | Updated on Oct 10 2026 5:49 AM

Centre govt is afraid of Gen Z, has imposed Emergency

కేంద్రంపై దీప్కే ఆగ్రహం

ముంబై:  కేంద్ర ప్రభుత్వం జెన్‌ జెడ్‌కు భయపడి దేశంలో ఎమర్జెన్సీ విధించిందని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆరోపించారు. ఢిల్లీలో శనివారం తాము తలపెట్టిన ప్రదర్శనను భగ్నం చేయడానికి కుతంత్రాలు సాగిస్తోందని, అందుకే ఆంక్షలను విధించిందని మండిపడ్డారు. మన యువతను ప్రభుత్వం పాకిస్తాన్‌ పౌరులలాగా ఎందుకు చూస్తోందని ప్రశ్నించారు. దీప్కే శనివారం ముంబై ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. 

ఢిల్లీలో అమలు చేస్తున్న ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనకారులను అడ్డుకోవడానికి సాధారణ ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర సర్కార్‌ జెన్‌ జెడ్‌కు భయపడుతోందని ఎద్దేవా చేశారు. జంతర్‌మంతర్‌ వద్ద కచ్చితంగా నిరసన తెలియజేస్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తమ వాలంటీర్లు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని స్పష్టం చేశారు. ‘‘యువతను చూస్తే మీకు అంత భయం కలిగితే మొత్తదం దేశాన్నే మూసివేయండి’’అని ఎద్దేవా చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement