ట్రిబ్యునళ్లలో ఖాళీల భర్తీ

Centre Clears Appointments To Tribunals After Supreme Court Ultimatum - Sakshi

ఎన్‌సీఎల్‌టీ, ఐటీఏటీలలో నియామకాలు

ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రజనికి చోటు

సాక్షి, న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్లలో నియామకాల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), ఆదాయ పన్ను అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ), అర్మ్‌డ్‌ పోర్సెస్‌ ట్రిబ్యునల్‌ (ఏఎఫ్‌టీ)ల్లో ఖాళీలు భర్తీ చేస్తూ నోటిఫికేషన్లు జారీ చేసింది. నియామకాలు చేపట్టకుండా ట్రిబ్యునళ్లను నిర్వీర్యం చేస్తున్నారని, తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని సుప్రీంకోర్టు ఈనెల 6న కేంద్రం వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 13లోగా కొన్ని నియామకాలైన చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఖాళీల భర్తీని కేంద్రం చేపట్టింది. వివిధ ట్రిబ్యునళ్లలో దాదాపు 250 దాకా ఖాళీలు ఉన్నాయి.  

ఎన్‌సీఎల్‌టీ: ఎనిమిది మంది జ్యుడీషియల్, 10 మంది సాంకేతిక సభ్యుల్ని నియమించింది. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజని, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌ నరహరి దేశ్‌ముఖ్, మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.రామతిలగం, పంజాబ్‌ హరియాణా హైకోర్టు విశ్రాంత రిజి్రస్టార్‌ జనరల్‌ హర్నామ్‌ సింగ్‌ ఠాకూర్, పి.మోహన్‌రాజ్, రోహిత్‌ కపూర్, జస్టిస్‌ దీప్‌ చంద్ర జోషి ఎన్‌సీఎల్‌టీలో జ్యుడీíÙయల్‌ సభ్యులు. వీరంతా ఐదేళ్ల పదవీకాలం, 65 ఏళ్ల వయసు.. ఏది ముందు ముగిస్తే అప్పటి వరకూ కొనసాగుతారు.  

ఐటీఏటీ: జ్యుడీíÙయల్‌ సభ్యులుగా అన్‌రిజర్వు కేటగిరీలో అడ్వొకేట్‌ సంజయ్‌ శర్మ, అడ్వొకేట్‌ ఎస్‌.సీతాలక్ష్మి , అదనపు జిల్లా, సెషన్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.గోయెల్, జస్టిస్‌ అనుభవ్‌ శర్మ. ఓబీసీ కేటగిరీలో అడ్వొకేట్‌ టీఆర్‌ సెంథిల్‌కుమార్, ఎస్సీ కేటగిరీలో ఎస్‌బీఐ లా ఆఫీసర్‌ మన్‌మోహన్‌ దాస్‌లను నియమించారు. వీరి పదవీకాలం నాలుగేళ్లు, లేదా 67 ఏళ్లు..  ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది.  

ఏఎఫ్‌టీ: ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రిబ్యునల్‌లో ఆరుగురు జ్యుడీíÙయల్‌ సభ్యుల్ని కేంద్రం నియమించింది. జస్టిస్‌ బాలకృష్ణ నారాయణ, జస్టిస్‌ శశికాంత్‌ గుప్తా, జస్టిస్‌ రాజీవ్‌ నారాయణ్‌ రైనా, జస్టిస్‌ కె.హరిలాల్, జస్టిస్‌ ధరమ్‌చంద్ర చౌదరి, జస్టిస్‌ అంజనా మిశ్రాలను నియమించింది. వీరి పదవీ కాలం నాలుగు సంవత్సరాలు, 67 ఏళ్లు ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది. ఢిల్లీ, చండీగఢ్, లక్నోల్లో ఏఎఫ్‌టీ నాలుగు బెంచ్‌లు ఉన్నాయి. ఆయా ట్రిబ్యునళ్లలో 19 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.  
రిటైర్డ్‌ జస్టిస్‌ రజని

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top