కొత్త కరోనా టెన్షన్‌: వారికి ఈ మార్గదర్శకాలు తప్పనిసరి

Center Issues SOPs For Passengers From UK Amid New Strain Fear - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో ఓ వైపు కరోనా కేసులు తగ్గుతుంటే.. మరోవైపు కొత్త స్ట్రెయిన్ కేసులు కలవరం పుట్టిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 29 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కొత్త స్ట్రెయిన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనవరి 7 వరకు బ్రిటన్‌ నుంచి వచ్చే విమాన సర్వీసులపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే జనవరి 8 నుంచి మళ్లీ విమాన సర్వీసులను నడిపేందుకు భారత్‌ సిద్ధమైనట్లు పౌర విమానయాన మంత్రి హర్దిప్‌పూరి శుక్రవారంవెల్లడించారు. ఈ క్రమంలో యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్ర ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు యూకే రిటర్న్స్‌ కోసం నిర్దేశిత మార్గర్శకాలను(సాప్స్‌) విడుదల చేసింది. చదవండి: వ్యాక్సిన్‌పై సుబ్రమణియన్‌ స్వామి కీలక వ్యాఖ్యలు

బ్రిటన్‌ నుంచి భారత్‌ వచ్చే ప్రయాణీకులందరికి కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేసింది.. సంబంధిత టెస్ట్‌లకు అయ్యే ఖర్చులు కూడా ఆ ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రయాణీకులను విమానంలోకి అనుమతించే ముందు విమానయాన సంస్థలు కరోనా వైరస్ నెగటివ్ టెస్ట్ రిపోర్టును నిర్ధారించాలని, యూకే నుంచి వచ్చే ప్రయాణీకులందరూ భారత విమానాశ్రయాలకు చేరగానే తప్పనిసరిగా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఎస్ఓపీలో పేర్కొంది. కరోనా నెగిటివ్‌ వచ్చినవారు 14రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జనవరి 30 వరకు అమల్లో ఉంటాయి. చదవండి: కరోనా కన్నా టీబీ మరణాలే ఎందుకు ఎక్కువ?

యూకే రిటర్న్స్ కోసం కొత్త మార్గదర్శకాలు: 
► యూకే నుంచి వచ్చే వారందరూ 72 గంటల ముందు ఆన్‌లైన్‌ పోర్టల్‌ https://www.newdelhiairport.in/ లో కోవిడ్ టెస్ట్‌లో నెగెటివ్‌గా రిపోర్టు సమర్పించాలి.
► ప్రయాణికుడిని విమానంలోకి ఎక్కడానికి అనుమతించే ముందు విమానయాన సంస్థలు కోవిడ్ నెగిటివ్‌ రిపోర్ట్‌ను పరిశీలించాలి.
►ఆర్టీపీసీఆర్‌ టెస్ట్ లేక, టెస్ట్ జరిగిన తర్వాత ఫలితం కోసం చూసేవారికోసం విమానాశ్రయంలో షెల్టర్, హెల్ప్‌ డెస్క్‌ కల్పించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
► సదరు ప్రయాణికుడికి కోవిడ్ పాజిటివ్‌గా తేలితే ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉండే విధంగా చూడాలి. నెగెటివ్‌గా తేలేవరకూ ఐసోలేషన్‌లో ఉండాలలి
►కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించిన.. అటూ ఇటూ మూడు వరసల్లో ఉన్న ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి.
►యిర్‌పోర్ట్‌లో నెగెటివ్‌గా తేలిన వ్యక్తి అధికారుల పర్యవేక్షణలో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top