ల్యాండ్ ఫర్‌ జాబ్‌ : లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మరో ఎదురు దెబ్బ | Cbi Files Conclusive Charge Sheet Against Lalu Prasad Yadav | Sakshi
Sakshi News home page

ల్యాండ్ ఫర్‌ జాబ్‌ : లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై సీబీఐ మరో ఛార్జ్‌ షీట్‌ దాఖలు

Jun 7 2024 8:20 PM | Updated on Jun 7 2024 8:30 PM

Cbi Files Conclusive Charge Sheet Against Lalu Prasad Yadav

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కేసులో లాలూపై సీబీఐ మరో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఆ ఛార్జ్‌ షీట్‌లో లాలూతో పాటు మరో 71 మందిని చేర్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గోగానే ఆ ఛార్జ్‌ షీట్లపై విచారణ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై న్యాయమూర్తి జులై 6న తేల్చనున్నారు.

గత మే 29న ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కేసులో కంక్లూజీవ్‌ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి  సీబీఐని నిలదీశారు. ఛార్జిషీటు దాఖలు చేసేందుకు ప్రతి తేదీకి మరింత సమయం కావాలని సీబీఐ కోరడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 7లోగా తుది నివేదికను దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించారు. ఢిల్లీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాజాగా కోర్టు ఛార్జ్‌ షీట్‌ను దాఖలు చేసింది.

ఉద్యోగాలే లేవు.. అయినప్పటికీ 
లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 2004 నుంచి 2009 వరకు రైల్వేమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో జోనల్ రైల్వేలలో ఉద్యోగాలపై అధికారిక నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. అయినప్పటికీ పాట్నా, ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్‌లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నియమించారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబం, సహచరుల పేరుతో భూములను తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి.

కంక్లూజీవ్‌ ఛార్జ్‌ షీట్‌ అంటే?
ఒక వ్యక్తికు సంబంధించిన ఏదైనా కేసును దర్యాప్తు సంస్థలు పూర్తి విచారణ చేపట్టిన అనంతరం.. సదరు వ్యక్తి నేరం చేశారని నిర్ధారిస్తూ అభియోగాలు మోపుతూ కోర్టు దాఖలు చేసే దానిని కంక్లూజీవ్‌ ఛార్జ్‌ షీట్‌ అంటారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement