డేటా చోరీ: కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు సీబీఐ షాక్‌!

CBI Files Case Against Cambridge Analytica For Facebook Data Theft - Sakshi

 ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటా చోరీ: కేంబ్రిడ్జ్ ఎనలిటికాపై సీబీఐ కేసు

సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డేటా బ్రీచ్‌ కేసులో సీబీఐ కేంబ్రిడ్జ్ అనలిటికాపై  శుక్రవారం కేసు నమోదు చేసింది. 5.62 లక్షల మంది భారతీయ ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను అక్రమంగా సేకరించిందనే ఆరోపణలతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) యూకేకు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాపై కేసు నమోదు చేసింది. ఇదే ఆరోపణలతో ఆ దేశానికి చెందిన మరో సంస్థ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జీఎస్ఆర్ఎల్) ను కూడా కేసులో చేర్చింది.

దీనిపై  ఫేస్‌బుక్‌ కూడా స్పందించింది. సుమారు 5.62 లక్షల భార‌తీయ యూజ‌ర్ల డేటాను అక్రమంగా సేకరించిన గ్లోబ‌ల్ సైన్స్ కంపెనీ అక్ర‌ ఆ డేటాను క్యాంబ్రిడ్జ్ అన‌లిటికాతో  పంచుకుందని తెలిపింది.  తద్వారా ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపించింది. కాగా దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసే లక్క్ష్యంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా భారతీయ ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫేస్‌బుక్-కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా చోరీ కేసుపై సీబీఐ దర్యాప్తు చేయనుందని కేంద్ర  సమాచా,ప్రసార, సాంకేతిక శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top