ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎగిరి చెరువులో పడ్డ కారు | Car Accident In Chattisgarh 8 Dead | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎగిరి చెరువులో పడ్డ కారు

Nov 3 2024 11:02 AM | Updated on Nov 3 2024 12:07 PM

Car Accident In Chattisgarh 8 Dead

రాయ్‌పూర్‌:ఛత్తీస్‌గఢ్‌లోని బల్‌రామ్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు మలుపు వద్ద అదుపుతప్పింది. దీంతో ఎగిరి పక్కనున్న చెరువులో  పడిపోయింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు ఆదివారం(నవంబర్‌ 3) వెల్లడించారు. కారు లరిమా నుంచి సూరజ్‌పుర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటు వారి పొరుగువారు కూడా ఉన్నారు. ఆరుగురు ప్రమాదం జరిగిన స్థలంలోనే మృతిచెందగా మిగిలిన ఇద్దరిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో చనిపోయారు. కారు అతివేగంలో వెళుతుండగా మలుపు తిప్పేటపుడు అదుపుతప్పడంతో చెరువులోకి దూసుకెళ్లినట్లు ప్రాథమికంగా తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టిన రైలు.. నలుగురు అక్కడికక్కడే మృతి 

Advertisement
 
Advertisement
Advertisement