బడ్జెట్‌ 2021: కోవిడ్‌ సెస్‌ పడనుందా?

Budge 2021 Centre May Introduce New Covid Cess - Sakshi

టాక్స్‌పేయర్స్‌పై కోవిడ్‌ సెస్‌ విధించే యోచన

సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మలా సీతారామన్‌ గాడిలో పెట్టనున్నారా.. లేదా అనే విషయం మరికొద్దిసేపట్లో తేటతెల్లం కానుంది. 2020 ఆర్థిక సంవత్సరాన్ని కరోనా కకావికలం చేసింది. ఆదాయం తక్కువ.. వ్యయం ఎక్కువయ్యింది. ఇక ఈ ఏడాది ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు వ్యాక్సినేషన్‌. దాదాపు 130 కోట్ల మంది జనాభాకు ఉచితంగా.. లేదా నామ మత్రపు ఖర్చుతో టీకా అందించడం అంటే మాటలు కాదు. మాస్‌ వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా సెస్‌ విధించాలని భావిస్తోన్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదనను కోవిడ్‌-19 సెస్‌, సర్‌చార్జ్‌గా అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో దీని గురించి ప్రకటన వెలువడనుందని సమాచారం. చాలా తక్కువ మొత్తంలో ఉండనున్న ఈ సెస్‌.. కేవలం టాక్స్‌ పేయర్స్‌కు మాత్రమే వర్తించబోతుందని తెలుస్తోంది. ప్రభుత్వం కోవిడ్-19 సెస్‌తో పాటు పెట్రోలియం, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ సెస్‌ను కూడా చేర్చాలని యోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక దీని గురించి మరి కాసేపట్లో తెలుస్తుంది.
(చదవండి: బడ్జెట్‌ బ్రదరూ.. జర భద్రం..!)

దేశ జనాభాలో ఎక్కువ భాగం టీకాలు వేయడానికి భారీ వ్యయాన్ని కేంద్రం భరించాల్సి వస్తోంది కాబట్టి.. కోవిడ్‌-19 సెస్‌ని ప్రవేశపెట్టవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 30 కోట్ల మందికి టీకా ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు, జాతీయ కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ వినోద్ పాల్ ఇంతకు ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మిగతా వారికి కూడా తక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌ని అందివ్వాలని భావిస్తున్నారు. కోవిడ్‌ టీకా పంపిణీ, శిక్షణ, లాజిస్టిక్స్ కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎదుర్కొనే అధిక ఖర్చులు చూస్తే, అధిక ఆదాయ వ్యక్తుల కోసం కోవిడ్ -19 సెస్ అవకాశం ఉండవచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top