ఫంక్షన్‌ హాల్‌లో హైడ్రామా: పెళ్లైన గంటకే విడాకులు.. ఆ తర్వాత..

Bride Marries Groom Brother On Wedding Stage At Uttar Pradesh - Sakshi

అతిథిలు, బ్యాండ్‌ చప్పుళ్ల మధ్య అంగరంభ వైభవంగా వారిద్దరికీ పెళ్లి జరిగింది. కానీ.. పెళ్లైన గంటకే వరుడు చేసిన పనికి అక్కడున్న వారంతా షాకయ్యారు. పెళ్లైన గంటకే భార్యకు విడాకులిచ్చి.. ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. యూపీలోని సంబల్‌ జిల్లాలోని సైద్‌నగలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 5 ఏండ్ల క్రితం వివాహమైంది. కాగా, వీరిద్దరి మధ్య గొడవల కారణంగా భార్యాభర్తలిద్దరూ విడిగా ఉంటున్నారు. గొడవల కారణంగా ఆమె.. భర్తకు దూరంగా తన పుట్టింట్లో​ ఉంటోంది. ఈ క్రమంలో భర్త.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో, కొన్ని నెలలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అనంతరం, ఒకరిపై ఒకరికి ఇష్టంతో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. 

ఈ నేపథ్యంలో అతడు.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య పెళ్లి మండపానికి చేరుకుని గొడవకు దిగింది. తాను ఉండగా రెండో వివాహం ఎలా చేసుకుంటారని ప్రశ్నించింది. దీంతో, ఒక్కసారిగి ఖంగుతిన్న వధువు కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో పోలీసు కేసుతో ఇబ్బందులు కలుగుతాయని భావించిన పెద్దలు పంచాయితీ పెట్టారు. పెద్దలు తీసుకున్న నిర్ణయం మేరకు ఆ వ్యక్తి పెళ్లైన గంటకే రెండో భార్యకు విడాకులు ఇచ్చి.. అదే మండపంతో ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటన యూపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top