కొద్ది క్షణాల్లో పెళ్లి.. నిర్ణయం మార్చుకున్న వధువు

Bride Cancels Marriage After Seeing Grooms Face Directly - Sakshi

తాళి కట్టే సమయంలో నో చెప్పిన వధువు

పట్నా : బీహార్‌లోని చంపారన్ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వాట్సాప్‌ చూసినట్లు వరుడి ముఖం లేదని చెప్పి చివరి నిమిషంలో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంది. బెట్టియాలోని షాంకియా మై ప్రాంతానికి చెందిన వరుడు అనిల్ కుమార్‌ అనే వ్యక్తితో చంపారన్‌ జిల్లాకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. బైరియాలోని తదీవానందపుర్‌కు చెందిన ఓ యువతికి మరో గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌ అనే యువకుడితో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. వాట్సాప్‌లో పంపిన యువకుడి ఫొటో చూసిన యువతి  పెళ్లికి అంగీకరిచింది. దీంతో రెండు కుటుంబాలు పెళ్లికి ఏర్పాట్లు చేసుకొని ఓ సుముహూర్తాన పెళ్లి తేదీ నిశ్చయించారు.

తాళి కట్టే సమయంలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అప్పటిదాకా నేరుగా వరుడిని చూడలేకపోయిన వధువు..పెళ్లి మండపంలో ఒక్కసారిగా అతడ్ని చూసి షాక్‌ అయ్యింది. వాట్సాప్‌ ఫోటోల్లో ఉన్నట్లుగా పెళ్లికొడుకు లేడని,తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. బంధువులు, కుటుంబసభ్యులు ఎంత నచ్చజెప్పినా వరుడు తనకి నచ్చలేదని, ఫోటోలో చూసిన విధంగా అబ్బాయి లేడని కారణం చెప్పి పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య స్వల్ఫ ఘర్షణ వాతావరణం నెలకొంది. పెళ్లికి అన్ని ఏర్పట్లు చేసుకొని, బంధువులను పిలిచి అవమానం ఏయడం ఏంటని వరుడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు వధువు తీసుకున్న నిర్ణయంతో పెళ్లికొడుకు వెనుదిరగక తప్పలేదు. 

చదవండి : (ఒక అమ్మాయి కోసం నలుగురు ఫైట్‌.. లక్కీ డ్రా!)
(అప్పగింతలే ఆమెకు ఆఖరి క్షణాలయ్యాయి!)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top