ఏకపక్ష ఆంక్షలతో ప్రజలపై  తీవ్ర ప్రభావం: పెజెష్కియాన్‌  | Brics must expand trade in national currencies, says Iran President | Sakshi
Sakshi News home page

ఏకపక్ష ఆంక్షలతో ప్రజలపై  తీవ్ర ప్రభావం: పెజెష్కియాన్‌ 

Sep 14 2026 6:02 AM | Updated on Sep 14 2026 6:02 AM

Brics must expand trade in national currencies, says Iran President

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలపై అధికంగా ఆధారపడితే వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు రాజకీయ ఒడిదుడుకులకు గురయ్యే ప్రమాదం ఉందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ చెప్పారు. అందుకే బ్రిక్స్‌ కూటమి దేశాలు తమ జాతీయ కరెన్సీల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక చట్రం దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఆదివారం బ్రిక్స్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. పాశ్చాత్య దేశాలపై విమర్శలు గుప్పించారు. 

కొన్ని దేశాలు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలు ప్రపంచ ఆహార భద్రత, ప్రజల సంక్షేమంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిక్స్‌ కూటమి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి సంబంధించిన ఒక వేదిక స్థాయిని దాటేసి, నేడు మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన ప్రపంచం కోసం పెరుగుతున్న ఆకాంక్షకు ప్రతీకగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. అటువంటి ప్రపంచంలో ఏ ఒక్కరికీ ఇతరుల భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఉండదని తేల్చిచెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement