Evening Top Trending News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Breaking News Telugu Latest News Online Telugu News Today 30th July 2022 - Sakshi

1. అసలు విషయం విస్మరించి.. విద్వేషాగ్ని చిమ్ముతున్నారు
పోలవరం ప్రాజెక్టు విషయం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ ఐఐటి ఇచ్చిన ఒక నివేదిక ఆధారంగా ఈనాడు తదితర తెలుగుదేశం అనుబంధ మీడియా సంస్థలు దారుణమైన అక్షర విధ్వంసానికి పాల్పడినట్లు అనిపిస్తుంది. ఈ నివేదికలోని అంశాలు ఇవ్వడాన్ని ఎవరూ కాదనరు. అయితే ఆ నివేదికలో ఉన్న అంశాలన్నీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న భావన కల్పించడానికి ఈ మీడియా చేసిన ప్రయత్నం సమర్ధనీయం కాదు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కేంద్రం కీలక నిర్ణయం.. వారికి ప్రతీనెల రూ.3వేల ఆర్థిక సాయం
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్రం వారికి ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. 40 నుంచి 10 శాతానికి పడిపోయిన రిషి సునాక్.. 90% లిజ్‌ ట్రస్‌కే ఛాన్స్‌!
బ్రిటన్ ప్రధాని రేసు తుది దశకు చేరుకుంది. లిజ్ ట్రస్, రిషి సునాక్‌లలో బోరిస్‌ జాన్సన్‌ వారసులెవరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. అయితే బ్రిటన్‌కు చెందిన బెట్టింగ్ సంస్థ స్మార్కెట్స్‌ మాత్రం తదుపరి ప్రధాని లిజ్ ట్రస్‌ కావడం దాదాపు ఖాయం అని చెబుతోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మునుగోడులో ఉప ఎన్నికపై భట్టి విక్రమార్క​ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో పాలిటిక్స్‌ శరవేగంగా మారుతున్నాయి. కాగా, కాంగ్రెస్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రెండు వారాల్లోనే కోలుకున్న మంకీపాక్స్ తొలి బాధితుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌
భారత్‌లో మంకీపాక్స్ బారినపడ్డ తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు. కేరళకు చెందిన ఇతడు తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా 72 గంటల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ నెగెటివ్ వచ్చినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. రాజమౌళిపై ‘ది గ్రే మ్యాన్‌’ డైరెక్టర్స్‌ ఆసక్తికర ట్వీట్‌.. జక్కన్న రిప్లై చూశారా?
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు జక్కన్న. ఆయన దర్శకత్వానికి, హాలీవుడ్‌ డైరెక్టర్లు సైతం ఫిదా అయ్యారు. ఇక ఇటీవల రిలీజైన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సాధించిన ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  అవెంజర్స్‌ వంటి క్రేజీ సిరీస్‌ను తెరక్కించిన రూసో బ్రదర్స్‌ తాజాగా రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బోణీ కొట్టిన భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం
బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బోణీ కొట్టింది. పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ ‌55 కేజీల విభాగంలో సంకేత్‌ సర్గార్‌ రజత పతకం సాధించాడు. ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన  సంకేత్‌.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, సీ ఎండ్‌ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

కార్వీ స్కామ్‌: భారీగా ఆస్తులు స్వాధీనం
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కెఎస్‌బీఎల్) సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్‌ చేసింది. కార్వీ సీఎండీ పార్థసారథి ఇతరులపై మనీ లాండరింగ్ విచారణకు సంబంధించి రూ.110 కోట్లకు పైగా విలువైన  ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ శనివారం తెలిపింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Pachi Batani Health Benefits: పురుషులు పచ్చి బఠానీలు ఎక్కువగా తిన్నారంటే..
పచ్చి బఠానీలను సాధారణంగా చాలా మంది కూరల్లో, కుర్మాలో వేస్తుంటారు. ఇవి చక్కటి రుచిని కలిగి ఉంటాయి. కొందరు వీటిని వేయించుకుని ఉప్పూకారం గరం మసాలా చల్లుకుని స్నాక్స్‌లా కూడా తింటారు. నిత్యం వీటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాం.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. విషాదం.. ఎలుకల కోసం విషం పూసిన టమాట తిని
ఇంట్లో ఎలుకల బెడదను నివారించడానికి ఉపయోగించిన విషం పూసిన టమాటోను తిని ఓ మహిళ మృత్యువాతపడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top