Pachi Batani Health Benefits: పురుషులు పచ్చి బఠానీలు ఎక్కువగా తిన్నారంటే..

Amazing And Surprising Health Benefits Of Green Peas Pachi Batani - Sakshi

పచ్చి బఠానీలతో ఆరోగ్యం పచ్చగా...

పచ్చి బఠానీలను సాధారణంగా చాలా మంది కూరల్లో, కుర్మాలో వేస్తుంటారు. ఇవి చక్కటి రుచిని కలిగి ఉంటాయి. కొందరు వీటిని వేయించుకుని ఉప్పూకారం గరం మసాలా చల్లుకుని స్నాక్స్‌లా కూడా తింటారు. నిత్యం వీటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాం.

ఫైబర్‌ వల్ల..
నిత్యం పచ్చి బఠానీలను తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది.
జీర్ణ సమస్యలు ఉండవు. ఇందులో ఉండే ఫైబర్‌ మలబద్ధకాన్ని తొలగిస్తుంది. తద్ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
పచ్చి బఠానీలను తినడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్‌ అందుతుంది. ఫలితంగా రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

కళ్లలో శుక్లాలు రాకుండా
వీటిలో ఉండే విటమిన్‌ సి వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఫైటో అలెక్సిన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా చూస్తుంది.
పచ్చి బఠానీల్లో లుటీన్‌ అనే కెరోటినాయిడ్‌ ఉంటుంది. ఇది కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఫలితంగా కంటి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారికి
పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్‌ గుండె జబ్బులు, హార్ట్‌ ఎటాక్‌ లు రాకుండా చూస్తుంది. శరీరంలో షుగర్‌ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
పచ్చిబఠానీల్లో క్యాలరీలు తక్కువగా... ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని ఎంపిక అని చెప్పవచ్చు. దీనివల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు.

పచ్చిబఠానీల్లో ఉండే విటమిన్‌ సి మన శరీరంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో చర్మం దృఢంగా, కాంతివంతంగా ఉంటుంది. ఫ్రీ ర్యాడికల్స్‌ నిర్మూలించబడతాయి. పచ్చి బఠానీల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్‌ వృద్ధాప్య ఛాయలు దరిచేరనీయవు. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

పురుషులు వీటిని తింటే..
పచ్చి బఠానీలు పురుషుల్లో శుక్ర కణాల సంఖ్యను పెంచుతాయి. అలాగే అవి ఎక్కువ వేగంగా కదిలే సామర్థ్యాన్ని పొందుతాయి. పచ్చి బఠానీల వల్ల శుక్ర కణాలు దృఢంగా మారుతాయి. దీంతో సులభంగా అండంతో కలుస్తాయి. ఫలితంగా సంతాన లోపం సమస్య ఉండదు.

ఇన్ని ప్రయోజనాలు ఉండే పచ్చి బఠానీలను ఎలా తీసుకున్నా ఆరోగ్యమే!
చదవండి: Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు..
Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top