సరిహద్దుల్లో ఉగ్రకాల్పులు | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో ఉగ్రకాల్పులు

Published Thu, Nov 23 2023 6:23 AM

Border firing in Rajouri district - Sakshi

రాజౌరీ/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కెపె్టన్‌లు, ఒక హవీల్దార్, ఒక జవాను వీరమరణం పొందారు. కాల్పులు జరుగుతున్న అటవీప్రాంతంలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను తుదముట్టించేందుకు మరింతగా భద్రతా బలగాలు అక్కడకు చేరుకుంటున్నాయని సైన్యాధికారులు బుధవారం చెప్పారు.

నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు విదేశీయులని సైన్యం వెల్లడించింది. గులాబ్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంలో గాలింపు చేపట్టగా ధరమ్‌సాల్‌ పరిధిలోని బజిమాల్‌ సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని ఆర్మీ ట్వీట్‌చేసింది. ఈ ఘటనలో ఒక మేజర్, ఒక జవాను గాయపడ్డారు.  
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement