సంజయ్‌దత్‌కు క్యాన్సర్‌! 

Bollywood Actor Sanjay Dutt Suffering With Cancer - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం. సంజయ్‌ సన్నిహితుడొకరు ఈ విషయాన్ని తెలిపారు. మెరుగైన చికిత్స అవసరమని, అందుకోసం సంజయ్‌ అమెరికాకు బయలుదేరి వెళతారని తెలిపారు. ఈనెల 8న ఊపిరి సరిగా ఆడటం లేదని సంజయ్‌దత్‌ లీలావతి ఆస్పత్రిలో చేరారు. అక్కడ కోవిడ్‌ పరీక్ష చేయగా నెగెటివ్‌ వచ్చింది. సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ‘వైద్యం నిమిత్తం నేను పని నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నా కుటుంబం, మిత్రులు తోడుగా ఉన్నారు. నా గురించి ఆందోళన చెందవద్దు, ఊహాగానాలు చేయవద్దని శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలతో త్వరలోనే తిరిగివస్తా’ అని సంజయ్‌ మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top