‘మహువా మొయిత్రాపై వేటు.. అది విచారకరమైన రోజు’ | Mahua Moitra's Expulsion Not A Happy Day: BJP MP Nishikant Dubey - Sakshi
Sakshi News home page

‘మహువా మొయిత్రాపై వేటు.. అది విచారకరమైన రోజు’

Published Sat, Dec 9 2023 6:00 PM

BJP MP Nishikant Dubey Says Mahua Expulsion Not Happy Day - Sakshi

ఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌ సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే మొదటిసారి స్పందించారు.

‘అవినీతి, జాతీయ భద్రత సమస్య విషయంలో ఓ ఎంపీ బహిష్కరణకు గురికావటం తనకు బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు. నిన్నటి రోజు(శుక్రవారం) సంతోషకరమైన రోజు కాదని, అదో విచారకరమైన రోజని తెలిపారు. అయితే మొయిత్రా తన లోక్‌సభ వెబ్‌సైట్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను వ్యాపారవేత్త దర్శన్‌ హీరా నందానీకి ఇచ్చారని నిశికాంత్‌ దూబే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఆయన ఫిర్యాదుతోనే స్పీకర్ ఈ వ్యవహరాన్ని ఎథిక్స్‌ కమిటీకి సిఫారసు చేయగా.. శుక్రవారం ఎథిక్స్‌ కమిటి నివేదిక ఆమెను దోషిగా తేల్చటంతో బహిష్కరణ గురయ్యారు. ఇక మొయిత్రాపై వేటుపడిన అనంతరం ఆమెపై ఫిర్యాదు చేసిన ఎంపీ నిశికాంత్‌ దూబే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement