బీజేపీ ‘ఆపరేషన్‌ బిహార్‌’ | BJP Campaign Woos Bihari Migrants Nationwide, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

బీజేపీ ‘ఆపరేషన్‌ బిహార్‌’

Jun 5 2025 5:38 AM | Updated on Jun 5 2025 9:18 AM

BJP campaign woos Bihari migrants nationwide

అసెంబ్లీ ఎన్నికలకు కొత్త వ్యూహం

2.75 కోట్ల వలస ఓట్లపై కన్ను

సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్న బిహార్‌పై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకోసం వినూత్నంగా ‘దేశవ్యాప్త’ వ్యూహం రూ పొందించింది. ఉపాధి కోసం దేశవ్యాప్తంగా వలస వెళ్లి న 2.75 కోట్ల మంది బిహారీల ఓట్లను సాధించడమే లక్ష్యంగా పథకరచన చేసింది. ఇందులో భాగంగా పార్టీ నేతలు దేశవ్యాప్తంగా పర్యటించి వా రందరినీ వ్యక్తిగతంగా కలుసుకోనున్నారు. 

బిహార్‌లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కనీసం 15 వేల నుంచి 20 వేల మంది వలసదారులున్నట్టు చెబుతు న్నారు. వారిలో కనీసం ఐదేసి వేల మందైనా బీజేపీకి ఓటేసే లా ప్రభావితం చేయాలన్నది టార్గెట్‌. ఈ దిశ గా బిహారీ వలసదారుల సమాచారాన్ని సేకరించను న్నా రు. 

‘ఆమ్‌ బిహారీ ప్రవాసీ కీ జాన్‌కారీ’ పేరు తో 14 ప్రశ్నలతో కూడిన జాబితాను బీజేపీ సిద్ధం చేసు కుంది. పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్, వృత్తి, అసెంబ్లీ నియోజకవర్గం, బీజేపీ మద్దతుదారుడా కాదా, ఓటరు గుర్తింపు కార్డు ఉందా లేదా వంటి సమాచారాన్ని సేక రించనున్నారు. ఈ ఏడాది బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిహారీ దివస్‌కు కొనసాగింపుగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement