ఆరోగ్య మంత్రి వీడియో చాట్‌ దుమారం.. బీజేపీ రాజీనామా డిమాండ్‌

BJP Attack Jharkhand Minister Alleged Chat With Woman - Sakshi

జార్ఖండ్‌ హెల్త్‌ మినిస్టర్‌ ఓ మహిళతో చేసిన వీడియో చాట్‌ పెను దుమారం రేపుతోంది. ఇదే అదనుగా బీజేపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. ఆ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తోంది.

జార్ఖండ్‌ ఆరోగ్య శాఖ మంత్రి, కాంగ్రెస్‌ నేత బన్నా గుప్తా ఓ మహిళతో చేసిన వీడియో చాట్‌ తీవ్ర కలకలం సృష్టించింది. అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శల దాడికి దిగింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ఈ వీడియో కాంగ్రెస్‌ ఒరిజినాల్టిని బట్టబయలు చేసిందని విమర్శించారు.అలాగే బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్‌ షాదేయో కూడా ఈ అసభ్యకరమైన వీడియోపై కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు.

ఆయన ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గంలోని సభ్యుడు కాబట్టి ఆ వీడియో క్లిప్‌ నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నారు. దీనిపై దర్యాప్తు చేసేలా సీఎం ఆదేశించాలని పట్టుబట్టారు షాదేయో. ఆ మంత్రికి సంబంధించిన వీడియో వాస్తవమని తేలితే వెంటనే అతను మంత్రి పదవి నుంచి వైదొలగాలన్నారు.

ఈ వ్యాఖ్యలపై సదరు ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా స్పందిస్తూ.. తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమే ఆ వీడియో క్లిప్‌ అంటూ మండిపడ్డారు. అదంతా ఫేక్‌ అని, అది ఎడిట్‌ చేసిన వీడియో అని వివరణ ఇచ్చారు. దీనిపై తాను ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్లు కూడా చెప్పారు. ఎవరో కావలనే ఉద్దేశపూర్వకంగానే ఆ ఎడిట్‌ చేసిన ఫేక్‌ వీడియోని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని, దీని వెనుకు ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్‌ నేత బన్నా గుప్తా అన్నారు. 

(చదవండి: యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు..వివాదాస్పదంగా సామూహిక వివాహ పథకం..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top