బీజేపీ, బీజేడీ పొత్తు!.. ప్రజల ప్రయోజనాలే లక్ష్యం: దేబి ప్రసాద్ మిశ్రా | BJD Vice President Debi Prasad Mishra Explains About BJD And BJP Alliance | Sakshi
Sakshi News home page

బీజేపీ, బీజేడీ పొత్తు!.. ప్రజల ప్రయోజనాలే లక్ష్యం: దేబి ప్రసాద్ మిశ్రా

Mar 7 2024 6:09 PM | Updated on Mar 7 2024 6:10 PM

BJD Vice President Debi Prasad Mishra Explains About BJD And BJP Alliance - Sakshi

లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజూ జనతా దళ్ (బీజేడీ) బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి మధ్య పొత్తు గురించి ఢిల్లీ, ఒడిశా రాజకీయ వర్గాల్లో భారీగా ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో.. బీజేడీ వైస్ ప్రెసిడెంట్ 'దేబి ప్రసాద్ మిశ్రా' పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఒడిశా ప్రజల ప్రయోజనాలకు ఏది ఉపయోగపడుతుందో అది మా మార్గదర్శక సూత్రమని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇతర సీనియర్ బీజేడీ నాయకులు రాబోయే ఎన్నికలపై చర్చించడానికి త్వరలోనే సమావేశమవుతారని, ఇందులో ఒడిశా అభివృద్ధికి కావలసిన నిర్ణయాలు తీసుకుంటారని మిశ్రా వ్యాఖ్యానించారు. బీజేపీ, బీజేడీ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. సీట్ల పంపకాలపైన తాత్కాలిక ఒప్పందం జరిగిందని, ఈ విషయం మీద త్వరలోనే అధికారికి ప్రకటన వెలువడుతుందని సమాచారం.

బీజేపీ, బీజేడీ నాయకుల సమావేశం ఓ ముఖ్యమైన పరిణామాన్ని సూచిస్తోందని.. ఎన్‌డీఏ నుంచి విడిపోయిన 15 సంవత్సరాల తరువాత మళ్ళీ బీజేడీ కూటమిలో కలవనున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. 2009లో సీట్ల పంపకాల మీద కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ.. ఇకపైన రెండు పార్టీలకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement