బిల్కిస్‌ బానో దోషుల విడుదల.. సుప్రీంలో కీలక పరిణామం

Bilkis Bano Convicts Release: SC Agrees To hear fresh plea - Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌ మారణకాండ సమయంలో జరిగిన బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి శిక్ష అనుభవిస్తున్న దోషుల్ని శిక్షా కాలం ముగియక ముందే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన తాజా పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.

బిల్కిస్‌ బానో కుటుంబసభ్యులు ఏడుగురి హత్యపై కూడా విచారించాలని ఆ పిటిషన్‌ పేర్కొంది. ఇప్పటికే  నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ వుమెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సి.టి. రవికుమార్‌లు ఆ ప్రధాన పిటిషన్‌కు దీనిని కూడా జత చేశారు. నేరస్తుల విడుదలపై దాఖలైన ఎన్నో పిటిషన్లకు గుజరాత్‌ ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదు.

దీనిపై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి మరింత సమయం ఇచ్చింది. గుజరాత్‌ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేస్తే నవంబర్‌ 29వ తేదీన దీనిపై న్యాయస్థానం విచారణ కొనసాగించనుంది.

ఇదీ చదవండి: తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top