అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా పోకిరీల హల్‌చల్‌ | Bengaluru Bikers Face Action For Blocking Ambulance, Performing Dangerous Stunts, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా పోకిరీల హల్‌చల్‌

Jul 7 2026 7:46 AM | Updated on Jul 7 2026 9:48 AM

Bikers Perform Stunts Block Ambulance With Patient In Bengaluru

బెంగళూరు: చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోగితో వెళ్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా పోకిరీలు ఆటంకం కలిగించారు. గురగుంటె పాళ్య నుంచి యశ్వంతపూర్‌ వరకూ బైక్‌లపై వీలింగ్‌ చేస్తూ.. పెద్దగా కేకలు వేస్తూ తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన వాహనదారులు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. యశ్వంతపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని నిందితుల ఆచూకీ కోసం సీసీ టీవీ       కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఇలాంటి వారి డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేయడంతోపాటు కఠిన శిక్ష   విధించాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement