
చట్టాలు, కఠిన శిక్షలు.. మానవ మృగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒకమూల ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీసీ కెమెరాల సాక్షిగా జరిగిన ఓ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తన మాన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువతి రోడ్డుపై పరుగులు తీసిన దృశ్యాలు అందులో ఉన్నాయి.
కొందరు కీచకులు ఒక మానసిక వికలాంగురాలిని బైకుల మీద వెంటాడి.. ఎత్తుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రకటనకు విరుద్ధంగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ నేరానికి సంబంధించిన వాస్తవ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఉత్తర ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం తన బంధువు ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది!. ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనతో గాలించగా.. పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలోని పొదల్లో దుస్తులు చినిగిపోయి స్పృహ లేని స్థితిలో ఆమె కనిపించింది.
వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి.. వైద్యపరీక్షల అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బైక్ మీద వచ్చిన వ్యక్తి తన వెంటపడ్డాడని.. అతని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తానని ఆమె తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ప్రకటించారు. అయితే..
ఈ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఉండే బంగ్లా సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో.. యువతిపై జరిగింది సామూహిక అత్యాచారమని బాధిత కుటుంబం అంటోంది. ఈలోపు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజీలో బైక్ మీద కొందరు ఆమెను వెంబడించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలించి ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్ చేశారు.
A 21-year-old disabled girl was allegedly gang raped in Balrampur. A video has surfaced before the alleged gang rape, in which the girl is seen running on the road to escape from the accused. 5-6 bikes can be seen coming from behind. Police have now released a statement that they… pic.twitter.com/YPRdsaWodJ
— Mohammed Zubair (@zoo_bear) August 12, 2025